`ఉప్పెన` సంచలనం వైష్ణవ్‌ తేజ్‌తో నాగార్జున సినిమా ?

Published : Feb 17, 2021, 11:44 AM IST
`ఉప్పెన` సంచలనం వైష్ణవ్‌ తేజ్‌తో నాగార్జున సినిమా ?

సారాంశం

 వైష్ణవ్‌ తేజ్‌ ఎంట్రీతోనే సంచలనంగా మారిపోయాడు. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 12న సినిమా విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా వైష్ణవ్‌ తేజ్‌ మరో సినిమాకి కమిట్‌ అయ్యారు. నాగ్‌ ఈ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.

`ఉప్పెన` సినిమాతో సూపర్‌ హిట్‌ని అందుకున్నాడు వైష్ణవ్‌ తేజ్‌. మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడిగా, సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే రికార్డ్ సృష్టించాడు. ఓ డెబ్యూ హీరో సినిమా యాభై కోట్లు కలెక్ట్ చేయడం టాలీవుడ్‌లో ఇదే ఫస్ట్ టైమ్‌. అలా వైష్ణవ్‌ తేజ్‌ ఎంట్రీతోనే సంచలనంగా మారిపోయాడు. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 12న సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదొక సెన్సేషనల్‌ మూవీగా మారింది. అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

మరోవైపు క్రిష్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు వైష్ణవ్‌ తేజ్‌. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. ఇదిలా ఉంటే అప్పుడే మూడో సినిమా కూడా సెట్‌ అయ్యిందని తెలుస్తుంది. వైష్ణవ్‌తేజ్‌తో నాగార్జున ఓ సినిమా చేయబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో ఓ కొత్త దర్శకుడితో వైష్ణవ్‌తో సినిమా చేయాలని నిర్ణయించారట. దాదాపు ఇది ఖరారైందని టాక్‌. జులైలో సినిమా ప్రారంభం కానుందని టాక్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది