కాలంలో వెనక్కి వెళదామంటూ.. ప్రభాస్‌తో అదిరిపోయే ఫోటో షేర్‌ చేసుకున్న కృష్ణంరాజు..

Published : Feb 17, 2021, 10:06 AM IST
కాలంలో వెనక్కి వెళదామంటూ.. ప్రభాస్‌తో అదిరిపోయే ఫోటో షేర్‌ చేసుకున్న కృష్ణంరాజు..

సారాంశం

ప్రభాస్‌ హీరోగా పూజా హెగ్డే కథానాయికగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో `రాధేశ్యామ్‌` చిత్రం రూపొందుతుంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, ప్రసీద(కృష్ణంరాజు కూతురు) సంయుక్తంగా ఈ భారీ పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   

1970 కాలాన్ని చూపిస్తానంటున్న కృష్ణంరాజు. అందుకు జులై 30 వరకు వెయిట్‌ చేయండని తెలిపారు. అంతేకాదు ప్రభాస్‌తో దిగిన ఓ అదిరిపోయే ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ప్రభాస్‌ హీరోగా పూజా హెగ్డే కథానాయికగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో `రాధేశ్యామ్‌` చిత్రం రూపొందుతుంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, ప్రసీద(కృష్ణంరాజు కూతురు) సంయుక్తంగా ఈ భారీ పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

తెలుగు, హిందీతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాని విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. జులై 30న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ప్రేమికుల రోజు విడుదల చేసిన ఈ చిత్ర గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. 1970లో ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుందని టాక్‌. 

అయితే తాజాగా ఈసినిమాని ఉద్దేశించి కృష్ణంరాజు ఓ ఫోటోని పంచుకున్నారు. `70ల నాటి కాలాన్ని మరోసారి చూసొద్దాం.  జూలై 30న ఈ సినిమా చూస్తూ కాలంలో వెనక్కి వెళ్దాం` అని క్యాప్షన్‌  చేశారు. ఈ సినిమా షూటింగ్‌ లొకేషన్‌ లో ప్రభాస్‌తో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశారాయన. ప్రస్తుతం ఈ ఫోటో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్.. విక్రమాదిత్యగా కనిపించబోతున్నారు. అలాగే మ్యూజిక్‌ టీచర్‌ ప్రేరణగా పూజా హెగ్డే నటిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది