నాగార్జున ప్రెస్ మీట్ పెడితే ఇబ్బందులు తప్పవా ?

pratap reddy   | Asianet News
Published : Sep 01, 2021, 02:50 PM IST
నాగార్జున ప్రెస్ మీట్ పెడితే ఇబ్బందులు తప్పవా ?

సారాంశం

కింగ్ నాగార్జున త్వరలో బిగ్ బాస్ 5 షోతో తెలుగు ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నాడు. బిగ్ బాస్ 3, బిగ్ బాస్ 4 సీజన్లకు నాగార్జున విజయవంతంగా హోస్ట్ గా చేశారు.

కింగ్ నాగార్జున త్వరలో బిగ్ బాస్ 5 షోతో తెలుగు ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నాడు. బిగ్ బాస్ 3, బిగ్ బాస్ 4 సీజన్లకు నాగార్జున విజయవంతంగా హోస్ట్ గా చేశారు. ఇప్పుడు సీజన్ 5కి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 5న బిగ్ బాస్ 5 ప్రారంభం కానుంది. 

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 5కి ప్రచారంగా ఈ వారంలోనే నాగార్జున మీడియా సమావేశం నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఊహాగానం మాత్రమే. ఇంతవరకు అధికారిక ప్రకటన ఏది లేదు. 

ఈ సమయంలో నాగార్జున మీడియాతో ఇంటరాక్ట్ అయితే ఇబ్బందులు తప్పవనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఉంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, మీడియాలో నాగ చైతన్య, సమంత గురించి అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. 

రూమర్స్ వస్తున్నప్పటికీ అక్కినేని కాంపౌండ్ సైలెంట్ మైంటైన్ చేస్తోంది. అక్కినేని ఫ్యామిలిలో కుటుంబ సమస్యలు ఉన్నాయని ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఒక వేళ నాగార్జున మీడియా ముందుకు వస్తే ఈ ప్రశ్నలు తప్పకుండా ఎదురవుతాయి. 

సో ఈ టైంలో నాగ్ బిగ్ బాస్ కోసం మీడియా మీట్ నిర్వహిస్తారా లేదా అనేది బిగ్ క్వశ్చన్ గా మారింది. సినిమాల విషయానికి వస్తే నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శత్వంలో 'ఘోస్ట్' అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో 'బంగార్రాజు' చిత్రం చేస్తున్నారు. ఈ మూవీలో నాగ చైతన్య కూడా నటించనున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం
Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్