ఆపరేషన్‌లో బిగ్‌బాస్‌ చూపించారు.. 9.4కోట్ల ఓటింగ్‌.. లెక్కలు మారిపోతున్నాయ్‌ః నాగ్‌ హెచ్చరిక

Published : Nov 28, 2020, 11:33 PM IST
ఆపరేషన్‌లో బిగ్‌బాస్‌ చూపించారు.. 9.4కోట్ల ఓటింగ్‌.. లెక్కలు మారిపోతున్నాయ్‌ః నాగ్‌ హెచ్చరిక

సారాంశం

గుంటూరులో ఒకరికి బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేస్తుంటే బిగ్‌బాస్‌ చూపించారని వెల్లడించారు. బిగ్‌బాస్‌ చూస్తున్నప్పుడు మాత్రమే తాను కాన్‌సన్‌ట్రేట్‌గా చూడగలనని తెలిపాడు. పేషెంట్‌ అడిగి మరీ బిగ్‌బాస్‌ పెట్టించుకుని చూస్తే ఆపరేషన్‌ సక్సెస్ ఫుల్‌ పూర్తి చేసుకున్నారని తెలిపాడు. బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్‌ ఏంటో తెలిపారు. 

శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బిగ్‌బాస్‌కి విశేషమైన క్రేజ్‌ ఉందని చెప్పారు. గుంటూరులో ఒకరికి బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేస్తుంటే బిగ్‌బాస్‌ చూపించారని వెల్లడించారు. బిగ్‌బాస్‌ చూస్తున్నప్పుడు మాత్రమే తాను కాన్‌సన్‌ట్రేట్‌గా చూడగలనని తెలిపాడు. పేషెంట్‌ అడిగి మరీ బిగ్‌బాస్‌ పెట్టించుకుని చూస్తే ఆపరేషన్‌ సక్సెస్ ఫుల్‌ పూర్తి చేసుకున్నారని తెలిపాడు. బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్‌ ఏంటో తెలిపారు. 

మరోవైపు రోజులు దగ్గరపడుతున్నాయని, ఉత్కంఠ పెరిగిందన్నారు. ఒప్పుడు హౌజ్‌లో ఉన్న ఏడుగురు సూపర్‌ సెవెన్‌ అని తెలిపారు. ఈ వారం చేసిన మిస్టేక్స్ ఏంటో సభ్యుల చేత చేయించి వారికి ఇవ్వాల్సిన వార్నింగ్‌, సలహాలు ఇచ్చారు. తనకు అందరూ ఇష్టమని చెప్పాడు. మూడు వారాలే ఉందని, చాలా జాగ్రత్తగా, తమ కోసం గేమ్‌ ఆడాలని తెలిపాడు. అభిజిత్‌కి, హారికకి ప్రత్యేకంగా క్లాస్‌ పీకాడు నాగార్జున. 

ఈ వారం 9.4కోట్ల ఓటింగ్‌ వచ్చాయని చెప్పాడు. ఎలిమినేషన్‌ సేవింగ్‌ ప్రక్రియలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అరియానా, మోనాల్‌, అఖిల్‌, అవినాష్‌ నామినేషన్‌లో ఉండగా, వారిలో మోనాల్‌ సేవ్‌ అయ్యారు. దీంతో ఓటింగ్‌ ఊహించని విధంగా వస్తుందని, వారం వారం లెక్కలు మారిపోతున్నాయని, ఎవరూ ఊహించని విధంగా ఓటింగ్‌ ఉంటుందని, చాలా జాగ్రత్తగా ఆడాలని తెలిపారు. సభ్యులను హెచ్చరించాడు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్