నాగార్జునను డీలా పడేసిన డీల్

Published : Feb 16, 2017, 07:04 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
నాగార్జునను డీలా పడేసిన డీల్

సారాంశం

బాక్సాఫీస్ వద్ద బోర్లాపపడ్డ నాగార్జున ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ నష్టాలతో డీలాపడ్డ స్టార్ హీరో రెండు రోజులు ఇంట్లోంచి కదలకుండా, ఎవర్నీ కలవకుండానే నాగ్ కనీసం కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదా.. అంటే...

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో హిట్లు సాధించిన స్టార్ నాగార్దునకు ఫ్లాపులు కూడా కొత్తేం కాదు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న నాగార్జున ఏన్నో సినిమాల్లో హీరోగా నటించారు. అయితే ఏ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ కానీ, ఫెయిల్యూర్ కానీ తనను వ్యక్తిగతంగా పెద్దగా ప్రభావితం చేయలేదు. కానీ ఓం నమో వెంకటేశాయ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలు కావడం మాత్రం నాగార్జునను తీవ్రంగా నిరాశ పరిచింది.

 

నాగార్జున హాథీరామ్ బాబాగా నటించిన ఓంనమో వెంకటేశాయ చిత్రం ప్రివ్యూ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా క్లైమాక్స్ పట్ల కూడా మంచి స్పందన రావడం యూనిట్ లో కొత్త ఉత్సాహం నింపింది. కానీ ఓం నమో వేంకటేశాయ చిత్రం పరాజయంతో నిరుత్సాహ పడ్డ నాగార్జున కాసింత షాక్ కు గురయ్యారనే చెప్పాలి. రెండు రోజులుగా నాగార్జున ఎవరి కాల్స్ తీసుకుకోకుండా ఉండటమే కాక ఇంట్లోంచి ఎటూ వెళ్లలేదని సమాచారం. ఇంట్లోనూ ఎవరినీ కలవలేదట.

 

ఎన్నోో చిత్రాల్లో నటించి హిట్లు ప్లాపులు చూసినా... నాగార్జునకు మాత్రం ఓం నమో వేంకటేశాయ చిత్రం కలెక్షన్లు మానసికంగా వేధిస్తున్నాయని తెలుస్తోంది. ఎంతటి వారికైనా... ఎమోషన్ దెబ్బతింటే డీలా పడిపోతారనేది మరో సారి స్పష్టమైంది.

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం