ఎంగేజ్ మెంట్ అయిందిగా.. ఇక వేదాంతం రాక మరేమొస్తుంది

Published : Feb 15, 2017, 10:13 AM ISTUpdated : Mar 24, 2018, 12:18 PM IST
ఎంగేజ్ మెంట్ అయిందిగా.. ఇక వేదాంతం రాక మరేమొస్తుంది

సారాంశం

ప్రేమికులరోజుపై వెరైటీగా స్పందించిన చైతూ సమంత ఎంగేజ్ మెంట్ ఎలాగూ అయిపోయింది వేలంటైన్స్ డేపై ఫ్సాన్య్ కు ట్వీట్ ముక్క కూడా లేదు ప్రేమికులరోజుపై వేదాంతం చెప్తున్న చైతూ డార్లింగ్ సామ్

ప్రేమికుల రోజు సందర్భంగా టాలీవుడ్ ప్రేమజంట సమంత, నాగ చైతన్యలు సోషల్ మీడియాలో ఏమని పోస్ట్ చేస్తారో, అభిమానులతో ఎలాంటి ఫోటోలు పంచుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూసినా ఇరువురి నుండీ ఎలాంటి పోస్టు రాలేదు. అటు సమంత నుండి గానీ, నాగ చైతన్య నుండి గానీ ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా రాలేదు.

 

తీరా వాలంటైన్స్ డే గడిచిపోయిన తర్వాత 15న ఉదయం సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టింది. ప్రేమికుల రోజులో అంతగా ఏముంది? అన్ని రోజుల్లానే అది ఒక రోజు అంతే. నా లైఫ్ లో ప్రతిరోజు ప్రేమ ఉంది అంటూ.. ప్రేమికుల రోజును ఉద్దేశించి అభిమానులకు ప్రేమ గురించి పెద్ద లెక్చర్ ఇచ్చింది సమంత. దాంతోపాటు నాగ చైతన్యను ముద్దాడుతున్న ఫోటోను కూడా సమంత పోస్టు చేసింది.

 

 

కేవలం ఒక్క ప్రేమికుల రోజును మాత్రమే ప్రేమికులు ప్రత్యేకంగా సెలిబ్రేట్ చేసుకోవాల్సిన అవసరంలేదని, ప్రతి రోజూ ప్రేమికుల మధ్య ప్రేమ ఉంటే ఇలాంటివి అవసరం లేదని సమంత అంటోంది. ఆ రోజు గిఫ్టులు ఇచ్చి పుచ్చుకుంటనే ప్రేమ ఉన్నట్లు కాదని అలా చెప్పారు చైతూ-సమంతలు. సో ఇలా వేదాంత ధోరణితో తమ ప్రేమికులరోజు ప్రత్యేకం కాదని ప్రతిరోజు వేలంటైన్స్ డేనే అని నిరూపించారీ జంట.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే