ఇదేం ట్విస్ట్ : ప్రభాస్, రామ్ చరణ్ ఇద్దరూ కాదు.. సీన్ లోకి నాగ్

Published : Apr 23, 2023, 08:09 AM IST
ఇదేం ట్విస్ట్ : ప్రభాస్, రామ్ చరణ్ ఇద్దరూ కాదు.. సీన్ లోకి నాగ్

సారాంశం

ప్రభాస్‌, రామ్‌చరణ్‌ లు చూసి ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చారు. మహేష్‌ కూడా ఇచ్చారు. ఇండస్ట్రీలో అందరూ చాలా బాగుందని అన్నారు. అయితే నేను ప్రభాస్‌, రామ్‌చరణ్‌ కానీ ఫంక్షన్‌కు రమ్మని అన్నమాట చెప్పనేలేదు. 


అక్కినేని అఖిల్‌ నటించిన ఏజెంట్‌ సినిమా ట్రైలర్‌ రీసెంట్ గా  విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ట్రైలర్ కు ముందు లైట్ తీసుకునే్నా... ఇది చూశాక చాలా మంచి బజ్‌ ఏర్పడింది. ఈ సినిమాను ఈనెల 28న విడుదల చేస్తున్నారు. అయినా ఇంకా టెక్నికల్ వర్క్ లు  ఒక పక్క అవుతూనే వున్నాయి. మరోవైపు ప్రీరిలీజ్‌ వేడుకను ఈ రోజు చేయనున్నారు. ఇందుకు ప్రభాస్‌, రామ్‌చరణ్‌ వస్తున్నారని టాక్‌ వచ్చింది. అయితే అంత సీన్ లేదని తేలిపోయింది.  అవన్నీ కేవలం రూమర్స్ అని క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఈ ఈవెంట్ కు నాగ్ వస్తున్నారని అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ నేపధ్యంలో అఖిల్ ని వివరణ అడిగితే ఇలా చెప్పారు..

 అఖిల్ మాట్లాడుతూ...ట్రైలర్‌ విడుదలయ్యాక ప్రభాస్‌, రామ్‌చరణ్‌ లు చూసి ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చారు. మహేష్‌ కూడా ఇచ్చారు. ఇండస్ట్రీలో అందరూ చాలా బాగుందని అన్నారు. అయితే నేను ప్రభాస్‌, రామ్‌చరణ్‌ కానీ ఫంక్షన్‌కు రమ్మని అన్నమాట చెప్పనేలేదు. ఎలా వార్తలు రాస్తారో నాకే అర్థంకావడంలేదు అని చెప్పారు. ఇద్దరూప్రస్తుతం బిజీగా వున్నారు అని తేల్చి చెప్పారు.

అలాగే “ఏజెంట్‌ స్క్రిప్ట్‌ గురంచి నాన్నతో (Nagarjuna) అసలు మాట్లాడలేదు. ఎందుకంటే నా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ కి నేను తీసుకునే నిర్ణయాలే కారణం కావాలి గాని ఇతరులు కాదు. మనం సొంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడేగా మనం ఎదిగేది. ఇంకెన్నాళ్లని నాన్న పైనే ఆధారపడతాను. నాన్న ఇచ్చే సలహాలు తీసుకుంటాను కానీ నిర్ణయాలు నేనే తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇక ప్రతి విషయం గురించి నేను, అన్నయ్య (Naga Chaitanya) మాట్లాడుకుంటూ ఉంటాం” అంటూ వ్యాఖ్యానించాడు.

ఇక తన లైన్ అప్ లో నాలుగు సినిమాలు ఉన్నాయని తెలియజేయగా, అన్ని యాక్షన్ చిత్రాలే అని పేర్కొన్నాడు. జూన్‌లో ఒక సినిమా మొదలు కాబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే నాగార్జున 100వ సినిమా గురించి కూడా అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించి ఇంకా ఏదీ కన్ఫార్మ్‌ కాలేదంటూ తెలియజేశాడు. అటువంటి మైల్ స్టోన్ మూవీ చేసేటప్పుడు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకొని చేయాలి కాబట్టి అందుకు తగట్టు కథ వెతుకుతున్నట్లు చెప్పుకొచ్చాడు. 

ఇక మళయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఏజెంట్‌ను.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాతో సాక్షి వైద్య అనే కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి