బాలీవుడ్ స్టార్ రన్బీర్ తన భార్య అలియా భట్ చెప్పులు మోసినందుకు ట్రోల్ కు గురవుతున్నారు. చెప్పులు తీయడం వరకు ఓకే కానీ.. అలా చేయడం ఏంటంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ కపుల్ రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) - అలియా భట్ (Alia Bhatt) ఆయా ఈవెంట్లు, ఫంక్లన్లకు కలిసి వెళ్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత తప్పకుండా ఆయా కార్యక్రమాలకు కలిసి హాజరవుతూ వస్తున్నారు. ఏప్రిల్ 21న (నిన్న) ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రా తల్లి పమీలా చోప్రా (Pamela Chopra) తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇంటికెళ్లి వారి కుటుంబాన్ని సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు.
ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ కపుల్ రన్బీర్ కపూర్ - అలియా భట్ జంటగా హాజరయ్యారు. పమీలా మరణానికి విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. అయితే రన్వీర్, అలియా ఇద్దరు ఆదిత్య చోప్రా ఇంటికి చేరుకున్న సందర్భంగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇంట్లోకి వెళ్తున్న సమయంలో అలియా తన చెప్పులను ఇంటి బయట విడిచి లోనికి వెళ్లింది. రన్బీర్ ఆ చెప్పులను తీసి ఇంట్లో పెట్టారు. ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది.
అయితే, ఎంట్రెస్ ముందు భాగంలోనే దీపం వెలిగించి దేవుడి మందిరం కనిపిస్తోంది. రన్బీర్ కపూర్ అలియా చెప్పులను తీసుకెళ్లి నేరుగా మందిరానికి ముందు ఉంచారు. ఇది గమనించిన నెటిజన్లు రన్బీర్ పై ఫైర్ అవుతున్నారు. దైవ భక్తి చూపలేదంటూ మండిపడుతున్నారు. ‘బ్రహ్మస్త్ర’ లాంటి భారీ ప్రాజెక్ట్స్ లో నటించిన ఆయన ఇంత గమనించలేదా అంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఇదంతా ప్రమోషన్స్ కోసం స్టంట్ అని కూడా అంటున్నారు.
రన్బీర్ - అలియా 2022 ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకున్న రెండు నెలలకే ప్రెగ్నెన్సీ కూడా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు అదే ఏడాది నవంబర లో పండంటి ఆడబిడ్డ రాహకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఫ్యామిలీతో హ్యాపీలైఫ్ ను లీడ్ చేస్తున్నారు. మరోవైపు కేరీర్ పైనా శ్రద్ద పెడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో అలియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇక రన్బీర్ కపూర్ తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో Animal చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్. ఆగస్టు 11న విడుదల కానుంది.