#TheGhost:'నాగ్ కోసం ..'పుష్ప' హిందీ డిస్ట్రిబ్యూటర్ పరుగెత్తుకొచ్చాడు..ప్యాన్ ఇండియానే

Published : Sep 15, 2022, 08:05 AM IST
 #TheGhost:'నాగ్ కోసం ..'పుష్ప' హిందీ  డిస్ట్రిబ్యూటర్ పరుగెత్తుకొచ్చాడు..ప్యాన్ ఇండియానే

సారాంశం

యాక్షన్‌ చిత్రాలు, విజువల్‌ ఫీస్ట్‌లు ఆస్వాదించేవారికి ‘ది ఘోస్ట్‌’ కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది. దుబాయ్‌లో కీలకమైన షెడ్యూల్‌లో భాగంగా హై ఇంటెన్స్‌ స్టంట్‌ సీక్వెన్స్, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరించారు.


ప్యాన్ ఇండియా స్దాయిలో సినిమాలు రిలీజ్ చేయటం ఇప్పుడు కొత్తగా మొదలైన ట్రెండ్. చిన్నా,పెద్దా,సీనియర్, జూనియర్ హీరోలంతా తమ సినిమాలను దేశవ్యాప్తంగా జనాలు చూడాలని,అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే నాగ్ వంటి సీనియర్ హీరోకు ఆ సమస్య లేదు. ఆయన ఇప్పటికే హిందీకి పరిచయం. మొన్న బ్రహ్మాస్త్రతో మరింతగా జనాల్లోకి వెళ్లారు. దాంతో ఆయన తాజా చిత్రం ది ఘోస్ట్ ని హిందీలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు మొదలయ్యాయి. వివరాల్లోకి వెళితే..

‘కింగ్‌’ నాగార్జున నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ది ఘోస్ట్‌’. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్ గా నటించింది. ఇందులో నాగ్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌పై సస్పెన్స్‌ నెలకొంది. 

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, అదే రోజు చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ కూడా విడుదల కానుండటంతో ఈ సినిమా వాయిదా పడుతుందని సోషల్‌మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాన్ని చిత్ర టీమ్  ఖండించింది. సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. అక్టోబరు 5న కచ్చితంగా ‘ది ఘోస్ట్‌’ వస్తాడని స్పష్టం చేసింది. 

అలాగే ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్దాయిలో రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుష్పని బాలీవుడ్ లో రిలీజ్ చేసిన ముంబై డిస్ట్రిబ్యూటర్ మనీష్ ...ఈ డీల్ నిమిత్తం చర్చలు జరుపుతున్నారు. హిందీలో భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ చిత్రాలు, విజువల్‌ ఫీస్ట్‌లు ఆస్వాదించేవారికి ‘ది ఘోస్ట్‌’ కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది. దుబాయ్‌లో కీలకమైన షెడ్యూల్‌లో భాగంగా హై ఇంటెన్స్‌ స్టంట్‌ సీక్వెన్స్, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరించాం. ముఖ్యంగా ఎడారిలో చేసిన యాక్షన్‌ సీక్వెన్సెస్‌ సినిమాలో హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు.

‘ది ఘోస్ట్‌’లో 12 యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉన్నాయని, అవన్నీ వేటికవే ప్రత్యేకమని తెలిపింది. దర్శకుడు ప్రవీణ్ సత్తార్‌ వాటిని స్పెషల్‌గా డిజైన్‌ చేశారని, స్టంట్‌మాస్టర్ కూడా అంతే అద్భుతంగా తీశారని చెప్పింది. వెండితెరపై ఆ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని తెలిపింది. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో నాగ్‌, సోనాల్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. గుల్‌ పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: భరత్‌ - సౌరభ్‌, యాక్షన్‌: దినేష్‌ సుబ్బరాయన్‌, కేచ, ఛాయాగ్రహణం: జి.ముఖేష్‌.

 
 

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు