
కొత్తవాళ్లు శ్రీకాంత్, సంచిత బసు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ (First Day First Show). వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు వారాల క్రితం రిలీజైంది. అయితే సినిమా జనాలకు పెద్దగా పట్టలేదు. దాంతో సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చేసింది. దాంతో చాలా మంది ఈ సినిమాని థియేటర్ లో చూడలేదు. ఇప్పుడు వారంతా ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.
జాతిరత్నాలు సినిమా తో సూపర్ హిట్ దక్కించుకున్న దర్శకుడు అనుదీప్ కథ ను అందించగా.అదే జాతిరత్నాలు సినిమాకు అసిస్టెంట్ దర్శకుడుగా వ్యవహరించిన వంశీధర్ గౌడ్ దర్శకుడిగా మారి దర్శకత్వం వహించిన చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. ఈ సినిమాకి ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.ముఖ్యంగా అల్లు అరవింద్, వెన్నెల కిషోర్ లతో చేసిన ఫన్నీ వీడియోలు సినిమా గురించి సామాన్య జనాల్లో కూడా చర్చ జరిగేలా చేసింది.
పెద్ద ఎత్తున సినిమా కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా లో వచ్చాయి.ఇక చిరంజీవి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం లో పాల్గొనడం తో సినిమా కు మరింత హైప్ క్రియేట్ అయింది అనడంలో సందేహం లేదు. సినిమా ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు పుల్ పాయింట్ అయినా కూడా అనుదీప్ కచ్చితంగా ఏదో మ్యాజిక్ చేసి ఉంటాడని అంత భావించారు.కానీ అనుభవంగా సినిమా నిరాశ పర్చింది. ఇప్పుడు ‘ఆహా’ (Aha)లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇటీవలే తెలుగు సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాత కానీ డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేయవద్దంటూ నిర్మాతలు నిర్ణయించారు. ఈ సినిమా కు ఆ రూల్ వర్తించేటట్లు లేదు. ఈ సినిమా అంతకు ముందే ఎగ్రిమెంట్ అయ్యిందని వినికిడి. తాజాగా అధికారిక ప్రకటన రావడంతో ప్రేక్షకులు 23వ తారీఖున ఈ సినిమాను ఎలా ఉందో చూద్దాం అన్నట్లుగా కామెడీ ని ఇష్టపడే అభిమానులు ఎదురు చూస్తున్నారు.
స్టోరీలైన్:
అవి పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’రోజులు. అంటే 2001. తెలంగాణాలోని నారాయణ్ ఖేడ్ . అక్కడో పవన్ వీరాభిమాని శ్రీను (శ్రీకాంత్ రెడ్డి). మొదటి రోజు పవన్ సినిమా చూడకపోతే జీవితం వేస్ట్ అన్నది అతని ఫీలింగ్. అతనికో లవర్ లయ (సుచిత బసు) . ఆమె కూడా సేమ్ టు సేమ్. ఆమె ఓ ప్రపోజల్ పెడుతుంది. ‘ఖుషీ’ సినిమా టిక్కెట్లు తెస్తే, ఫస్ట్ డే ఫస్ట్ షో కలిసి చూద్దామని మాట ఇస్తుంది. తన కోసం, తన ప్రేయసి కోసం శ్రీను సినిమా టిక్కెట్లను సంపాదించడానికి బయిలు దేరతాడు. అయితే మధ్యలో అతని తండ్రి స్కూల్ హెడ్ మాస్టర్ (తణికెళ్లభరణి)కి ఇలాంటివి నచ్చవు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే ఛస్తారా అని ప్రశ్నస్తాడు. అటు తండ్రి నుంచి తప్పించుకుని శ్రీను ..ఖుషీ సినిమా టిక్కెట్లు ఎలా సంపాదించాడు. ఆ క్రమంలో ఏం జరిగింది అనేది మిగతా సినిమా కథ.