Bangarraju First Single promo: లడ్డుందా అంటోన్న నాగార్జున.. సోగ్గాడి సందడి షురూ

Published : Nov 07, 2021, 08:23 PM IST
Bangarraju First Single promo: లడ్డుందా అంటోన్న నాగార్జున.. సోగ్గాడి సందడి షురూ

సారాంశం

నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న `బంగార్రాజు` చిత్రం సందడి ప్రారంభమైంది. ఈ సినిమా నుంచి తొలి పాట రాబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటిపాట ప్రోమోని విడుదల చేశారు.

కింగ్‌ నాగార్జున(Nagarjuna) సందడి ప్రారంభమవుతుంది. `బంగార్రాజు`(Bangarraju)గా ఆయన సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం నాగార్జున `బంగార్రాజు` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వచ్చిన సూపర్‌ హిట్‌ `సోగ్గాడే చిన్ని నాయనా` చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమిది. తొలి చిత్రం దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రిమది. Nagarjuna నిర్మిస్తున్నారు. ఇందులో నాగచైతన్య(Naga Chaitanya) మరో హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జోడిగా కృతి శెట్టి (Krithi Shetty) కథానాయికగా నటిస్తుంది. 

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ లు ఆకట్టుకున్నాయి. మంచి ఆదరణ పొందాయి. దీపావళి కానుకగా విడుదల చేసిన Bangarraju విషెస్‌ వీడియో సైతం వైరల్‌ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో గిఫ్ట్ ఇవ్వబోతుంది యూనిట్‌. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫస్ట్ సాంగ్‌ ప్రోమోని విడుదల చేశారు. `లడ్డుందా`.. `అంటూ సాగే పాట ప్రోమో ఇప్పుడు ఫన్నీగా ఉంటూ ఆకట్టుకుంటుంది. ట్రెండ్‌ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి పాటని ఈ నెల 9న(మంగళవారం) విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఉదయం 9.09గంటలకు రిలీజ్‌ చేయనున్నారు. 

ఈ మేరకు తాజాగా విడుదల చేసిన పోస్టర్లో సోగ్గాడు పాత్రలో నాగార్జున ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు ఇందులో `బంగార్రాజు గారు నేర్పిత్తారు కదా` అనే డైలాగ్‌ కూడా ఆసక్తి రేపుతుంది. మరింత యంగ్‌గా కనిపిస్తున్నాడు. అయితే ఆయనకు జోడీగా కనిపించబోతున్న ఆ నటి ఎవరనేది సస్పెన్స్ గా ఉంది. నాగార్జున ప్రస్తుతం ఈ సినిమాతోపాటు `ఘోస్ట్` అనే మరో సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకుడు. ఇందులో కాజల్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా సైతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 

also read: మానస్‌తో ప్రియాంక పెళ్లికి ఒప్పుకోను.. కానీ దగ్గరుండి పెళ్లి చేస్తా.. మానస్‌ తల్లి ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

దీంతోపాటు నాగార్జున `బిగ్‌బాస్‌5`కి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఐదో సీజన్‌కి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ప్రతి వారం శని, ఆదివారాల్లో బుల్లితెరపై సందడి చేస్తున్నారు. నిత్యం ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. నాగార్జున నటించిన `సోగ్గాడే చిన్న నాయన` చిత్రం 2016 సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సాధించింది. నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. మరోవైపు నాగ్‌ చివరగా `వైల్డ్ డాగ్‌` చిత్రంలో నటించారు. ఈ సినిమా థియేటర్లో విడుదలై నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. కానీ ఓటీటీలో రిలీజ్‌ అయి మంచి విజయాన్ని సాధించడం విశేషం. 

also read: Kamal Haasan Birthday: ఇండియన్‌ సినిమాకి ఒకే ఒక్కడు కమల్‌కి ఇన్ని పేర్లా?.. వైరల్‌గా ఆస్తులు.. ఇంట్రెస్టింగ్‌

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
M4M Movie Review: ఎం4ఎం మూవీ రివ్యూ, రేటింగ్‌.. జో శర్మ, మోహన్‌ వడ్లపట్ల సినిమా ఎలా ఉందంటే?