బిగ్‌బాస్‌5ః షణ్ముఖ్‌ పరువు తీసేసిన నాగార్జున.. హైజ్‌లోని లవ్‌ ట్రాక్స్ రివీల్డ్

Published : Sep 11, 2021, 05:43 PM IST
బిగ్‌బాస్‌5ః షణ్ముఖ్‌ పరువు తీసేసిన నాగార్జున.. హైజ్‌లోని లవ్‌ ట్రాక్స్ రివీల్డ్

సారాంశం

ఒకరిపై ఒకరు అరుచుకోవడం, తిట్టుకోవడం,  ఆ తర్వాత క్షమాపణలు చెప్పుకోవడం, ఏడుపులతో సాగింది. వారాంతం వచ్చింది. శనివారం, ఆదివారం నాగార్జున సందడి చేయనున్నారు. దీంతో అంతా ఈ వారాంతం కోసం, ఫస్ట్ వీక్‌ ఎలిమినేట్‌ అయ్యే వారి కోసం ఎదురుచూస్తున్నారు. 

బిగ్‌బాస్‌5 మొదటి వారం చివరికి వచ్చింది. ఫస్ట్ వీక్‌ మొత్తం ఇంటి సభ్యులు తామేంటో చూపించుకునే ప్రయత్నంచేశారు. ఎవరి ఈగోలను వారు బయట పెట్టారు. ఒకరిపై ఒకరు అరుచుకోవడం, తిట్టుకోవడం,  ఆ తర్వాత క్షమాపణలు చెప్పుకోవడం, ఏడుపులతో సాగింది. వారాంతం వచ్చింది. శనివారం, ఆదివారం నాగార్జున సందడి చేయనున్నారు. దీంతో అంతా ఈ వారాంతం కోసం, ఫస్ట్ వీక్‌ ఎలిమినేట్‌ అయ్యే వారి కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఓ వైల్డ్ కార్ట్ ఎంట్రీని కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే తాజాగా లేటెస్ట్ ప్రోమో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులతో ముచ్చటించిన తీరు, వేసిన సెటైర్లు ఆకట్టుకుంటున్నాయి. జనరల్‌గా హోస్ట్ నాగ్‌ వచ్చాడంటే క్లాస్‌ పీకడాలుంటాయి. కానీ ఈ వారం అలాంటిదేమి లేనట్టు కనిపిస్తుంది. అందరి విషయంలో పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు నాగ్‌. ఫస్ట్ కెప్టెన్‌గా ఎంపికైన సిరికి అభినందనలు తెలిపారు నాగ్‌. 

ఆమె చూపించిన ఉత్సాహం నువ్వు చూపించలేదని సన్నీపై పంచ్‌లు వేశాడు. అనంతరం హౌస్‌లో ఆర్జే అవతారమెత్తి అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నావంటూ కాజల్‌ మీద ఛలోక్తి విసిరాడు. నెక్ట్స్ వీక్‌ అయినా ఎవరికో ఒకరికి ఫ్లవర్‌ ఇవ్వాలి అంటూ లహరికి సజెస్ట్ చేయగా, ఎవరినైనా పంపించండి అని లహరి చెప్పడంతో నాగ్‌ హౌజ్‌లో ఉన్న బాయ్‌ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీరామ్‌చంద్ర చేసిన పనికి అభినందించారు. ప్రియ స్పందిస్తూ హౌజ్‌లో మల్టీఫుల్‌ ట్రాక్స్ నడుస్తున్నాయని తెలిపింది.

కడుపుబ్బా నవ్విస్తున్న లోబో కామెడీకి చప్పట్లు కొట్టిన నాగ్‌.. షణ్ముఖ్‌ యాక్టివ్‌గా కనిపించకపోవడంపై సెటైర్లు వేశాడు. `అరేయ్‌ ఏంట్రా ఇది? కొంచెం కనబడరా.. వన్‌ వీక్‌ అయిపోయింది, ఆట మొదలెట్టరా` అని సెటైర్‌ వేయడంతో షణ్ముఖ్‌ నవ్వులు పూయిస్తూ సిగ్గులొలికించాడు.  మొత్తానికి నాగ్‌ ఎంట్రీతో నేటి ఎపిసోడ్‌ మరింత ఎంటర్‌టైనింగ్‌గా మారిందని చెప్పొచ్చు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో జెస్సీ, యాంకర్‌ రవి, సరయు, మానస్‌, కాజల్‌, హమీద ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారో చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Raktha Sambandham Review : ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి
3 Roses 2 OTT Review: 3 రోజెస్‌ సీజన్‌ 2 రివ్యూ.. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత బోల్డ్ సిరీస్‌ ఎలా ఉందంటే?