స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్... కుటుంబసభ్యులతో ఒకే ఒక్క మాట, రేపు కీలక సర్జరీ

Siva Kodati |  
Published : Sep 11, 2021, 05:39 PM ISTUpdated : Sep 11, 2021, 05:40 PM IST
స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్... కుటుంబసభ్యులతో ఒకే ఒక్క మాట, రేపు కీలక సర్జరీ

సారాంశం

సినీనటుడు సాయి ధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. వీడియో కాల్‌లో ఆయన కుటుంబసభ్యులతో ఒక నిమిషం మాట్లాడినట్లుగా కథనాలు వస్తున్నాయి. నొప్పిగా వుందంటూ ఒకే ఒక మాట మాట్లాడిన అనంతరం ఫోన్ పెట్టేసినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. 

రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీనటుడు సాయి ధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. వీడియో కాల్‌లో ఆయన కుటుంబసభ్యులతో ఒక నిమిషం మాట్లాడినట్లుగా కథనాలు వస్తున్నాయి. నొప్పిగా వుందంటూ ఒకే ఒక మాట మాట్లాడిన అనంతరం ఫోన్ పెట్టేసినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు రేపు సాయి ధరమ్ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ నిర్వహించనున్నారు అపోలో వైద్యులు. శనివారం ఉదయం నుంచి సాయి  ధరమ్ తేజ్‌కు వైద్య పరీక్షలు  నిర్వహిస్తున్నారు డాక్టర్లు. కాసేపటి  క్రితమే ఆయనకు ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించారు అపోలో వైద్యులు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌కు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. 

మరోవైపు సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నరేష్ కుమారుడు నవీన్, సాయి ధరమ్ తేజ్, మరో వ్యక్తి ఒకే చోటికి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ తన ఇంటి నుంచే బయలుదేరాడని నటుడు నరేష్ చెప్పిన విషయం తెలిసిందే. నరేష్ కుమారుడు నవీన్ ను కూడా పోలీసులు బైక్ రైడర్ గా గుర్తించారు.

ALso Read:సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదంలో కొత్త కోణం.. బైక్‌ రేసింగే కొంప ముంచిందా?

బైక్ రైడింగ్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ ను ప్రశ్నిస్తామని డీసీపీ చెప్పారు. అవసరమైతే నటుడు నరేష్ ను, ఆయన కుమారుడు నవీన్ ను కూడా ప్రశ్నిస్తామని ఆయన చెప్పారు. బైక్ రైడింగ్ చేస్తే తీవ్రమైన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ రెండు రోజుల కలెక్షన్లు.. రెండో రోజు పడిపోయిన బాలయ్య సినిమా వసూళ్లు..
జూనియర్ ఎన్టీఆర్ కు ఇరిటేషన్ తెప్పించి, బీపీ పెరిగిపోయేలా చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా? తారక్ ఏం చేశాడంటే?