Nagarjuna: ఆరు పదుల వయసులో కింగ్ నాగార్జున డేంజరస్ స్టంట్స్

Published : Mar 15, 2022, 04:28 PM ISTUpdated : Mar 15, 2022, 04:35 PM IST
Nagarjuna: ఆరు పదుల వయసులో కింగ్ నాగార్జున డేంజరస్ స్టంట్స్

సారాంశం

ఆరు పదుల వయసులో కింగ్ నాగార్జున సాహస స్టంట్స్ చేస్తున్నారు. దుబాయ్ ఎడారిలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఘోస్ట్ మూవీ కోసం నాగ్ చమటోడుచుతున్నారు.   

మూడున్నర దశాబ్దాల కెరీర్ లో నాగార్జున (Nagarjuna)అనేక ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. లవ్, ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ తో పాటు భక్తిరస చిత్రాలలో నటించారు. ఈసారి ఆయన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎంచుకున్నారు. గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఘోస్ట్ టైటిల్ తో నాగ్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్ర లేటెస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ నందు కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

దుబాయ్ ఎడారిలో స్పోర్ట్స్ బైక్ పై నాగార్జున సాహసాలు చేస్తున్నారు. ఎండాకాలం ఎడారి వాతావరణం ఎంత కఠినతరంగా ఉంటుందో తెలిసిన విషయమే. 60 ప్లస్ లో ఉన్న నాగార్జున ఫుల్ ఎనర్జీతో ప్రతికూల వాతావారణంలో స్టంట్స్ చేస్తున్నారు. సినిమా కోసం నాగార్జున కమిట్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఘోస్ట్ (The ghost)వర్కింగ్ స్టిల్స్ చూస్తే అర్థమవుతుంది. ఘోస్ట్ మూవీలో నాగార్జునకు జంటగా సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. సోనాల్ కూడా దుబాయ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. 

నారాయణ్ దాస్ నారంగ్, శరత్ మరార్, మోహన్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా బంగార్రాజు మూవీతో నాగార్జున హిట్ కొట్టారు. 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నాగార్జున, నాగ చైతన్యలు కలిసి నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా... రమ్యకృష్ణ కీలక రోల్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌