
'సెక్సీ' దుస్తులు ధరించడం పట్ల మహిళలను జడ్జ్ చేయడం సరికాదని బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా అభిప్రాయపడింది. ఈ మేరకు మహిళలు వారికి నచ్చిన దుస్తులు వేసుకోవడం పట్ల ట్రోల్స్ చేయొద్దని సూచించింది. అప్పటికే నటి నీనా గుప్తా అసాధారణమైన ఎంపికలు, ఎప్పుడూ తన మనసులోని మాటలను బహిర్గతం చేయడంలో చాలా ధైర్యంగా ఉంటుంది. అయితే తాజాగా స్త్రీలను ‘బధాయి హో’ స్టార్ వారి దుస్తుల ఆధారంగా అంచనా వేయడాన్ని నీనా గుప్తా వ్యతిరేకించారు. దీనిపై తన అభిప్రాయాలను వ్యక్తం పరిచింది. ఇందుకు నీనా సోమవారం రాత్రి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. ఆమె డ్రెస్సింగ్ ఎంపికల ద్వారా స్త్రీ పాత్రను అంచనా వేయడం మానేయాలని తెలిపింది. లేకపోతే తనకూ ట్రోల్స్ చేయడం తెలుసని.. సంస్కృతంలో ఎంఫిల్ డిగ్రీని కలిగి ఉందని కూడా తెలియజేసింది.
పొట్టి సెక్సీ డ్రెస్‌లు వేసుకునే వ్యక్తులు తరచుగా పనికిరాని వారిగా పరిగణించబడుతున్నారు. ఇకపై అలాంటి వ్యూ మారాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నేను సెక్సీ, పొట్టి దుస్తులు ధరిస్తున్నాను. దాంట్లో తప్పేముందంటూ అభిప్రాయపడింది. ఇప్పటికైనా దుస్తులను బట్టి స్త్రీలను అంచనా వేచడం మానుకోవాలని వీడియో క్లిప్‌లో పేర్కొంది.
వీడియోలో, నీనా సెక్సీగా, నెక్‌లైన్ టాప్‌లో ధరించి కనిపించింది. అయితే నీనా పోస్ట్ చేసిన వీడియోకు ఇంటర్నెట్ లో మంచి స్పందన వచ్చింది. నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో బాలీవుడ్ యాక్ట్రెస్ అనుష్క శర్మ (Anushka Sharma) కూడా నీనా పోస్ట్‌ను ఇష్టపడ్డారు. ఇందుకు కామెంట్ విభాగంలో పింక్ డబుల్ హార్ట్ ఎమోజీలను వదిలింది. నటి మహిమా చౌదరి, "మీ టూ క్యూట్" అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ డాలీ సింగ్ కూడా కామెంట్ సెక్షన్‌లో పైకెత్తిన ఎమోజీలను వదిలారు. అలాగే కియారా అద్వానీ (Kiara Advani) కూడా ఈ పోస్ట్ ను లైక్ చేశారు.
ఇక నీనా ఇప్పటికీ పలు చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. నెట్‌ఫ్లిక్స్ 'మసాబా మసాబా' షో రెండవ సీజన్‌లో నీనా తన కుమార్తె స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్న మరియు శివిన్ నారంగ్ నటించిన వికాస్ బహ్ల్ యొక్క 'గుడ్‌బై'లోనూ నీనా నటించారు. చివరిగా బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) నటించిన ‘83’ చిత్రంలో రాజ్ కుమారి పాత్రలో నటించారు.