Nagarjuna : ఆ విమర్శలు నాగార్జునకు పట్టవా!

Published : Aug 11, 2022, 01:37 PM IST
Nagarjuna : ఆ విమర్శలు నాగార్జునకు పట్టవా!

సారాంశం

ఎవరేమంటే నాకెంటీ చేసుకుంటూపోతా అంటున్నారు నాగార్జున. బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న నాగార్జునపై ఎన్ని విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. సక్సెస్ఫుల్ గా బిగ్ బాస్ సీజన్ 6 హోస్ట్ బాధ్యతలు తీసుకున్నారు.  

ఎవరేమంటే నాకెంటీ చేసుకుంటూపోతా అంటున్నారు నాగార్జున. బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న నాగార్జునపై ఎన్ని విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. సక్సెస్ఫుల్ గా బిగ్ బాస్ సీజన్ 6 హోస్ట్ బాధ్యతలు తీసుకున్నారు.

ఎక్కడో విదేశాల్లో మొదలైన బిగ్ బ్రదర్ రియాలిటీ షో సూపర్ సక్సెస్. దానికి స్ఫూర్తిగా బాలీవుడ్ లో చాలా కాలం క్రితం బిగ్ బాస్ షో ప్రారంభమైంది. కొందరు సెలబ్రిటీస్ ని ఒక ఇంటిలో ఉంచి, ప్రపంచంతో సంబంధం లేకుండా ఓ వాతావరణం సృష్టించి వాళ్లతో మాసికమైన, శారీరకమైన గేమ్స్ ఆడించడమే బిగ్ బాస్. ఇండియాలో ఈ షో బిగ్ సక్సెస్. ఈ క్రమంలో అన్ని భారతీయ బాషలకు ఈ షో వ్యాపించింది. 2017లో ఎన్టీఆర్ హోస్ట్ గా షో ప్రారంభమైంది. ఫస్ట్ సీజన్ గ్రాండ్ సక్సెస్. షో ఎక్కడానికి కొంచెం టైమ్ తీసుకున్నా తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చింది.

ఇక 2019 నుండి బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున కొనసాగుతున్నారు. సీజన్ 3 నుండి ఆయన సక్సెస్ఫుల్ హోస్ట్ గా ఉన్నారు. ఇక లేటెస్ట్ సీజన్ బిగ్ బాస్ 6 హోస్ట్ కూడా ఆయనే. ప్రోమో విడుదల కాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. నాగార్జున బిగ్ బాస్ నుండి తప్పుకున్నట్లు వార్తలు రాగా.. పుకార్లు అని తేలిపోయింది. ఇక కొందరు క్రేజీ కంటెస్టెంట్స్ పేర్లు కూడా తీరపైకి వచ్చాయి. ఈ క్రమంలో ప్రేక్షకులను అలరించడానికి షో సరికొత్తగా సిద్ధం కానుంది.

మరోవైపు షో పట్ల చాలా వ్యతిరేకత ఉంది.చాలా కాలంగా సంప్రదాయవాదులు పూర్తిగా ఖండిస్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు ఒకే ఇంట్లో ఉండడం, వాళ్ళ మధ్య ప్రేమలు, బహిరంగ రొమాన్స్ చేయడం సమాజ హితం కాదంటున్నారు. యువతను తప్పుదోవబట్టించే ఇలాంటి షో నిషేదించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. ఇక షో హోస్ట్ గా ఉన్న నాగార్జున విమర్శలకు గురవుతున్నారు. ఆయన ఈ బిగ్ బాస్ నుండి తప్పుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ఓ దశలో నాగార్జున ఇంటిని కొందరు ముట్టడించే ప్రయత్నం చేశారు. నిరసనలు తెలిపారు. కాగా ఈ విమర్శలు నాగార్జునకు పట్టకపోవడం విశేషం. హోస్ట్ గా భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్న నాగార్జున, ఎవరేమంటే నాకేంటి అంటున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే