వి.వి వినాయక్ సినిమాను రిజెక్ట్ చేసిన సౌందర్య, ఆ విషయం నచ్చకనేనట ..?

By Mahesh JujjuriFirst Published Aug 11, 2022, 1:28 PM IST
Highlights

టాలీవుడ్ కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన డైరెక్టర్ వి.వి.వినాయక్. ఈ స్టార్ డైరెక్టర్ కారణంగా..మాజీ హీరోయిన్ లయ ఏడ్చిందట. అసలు వినాయక్ తో ఇంత వరకూ ఒక్క సినిమా కూడా చేయని లయను.. ఆయన ఏడిపించడమేంటి....?

టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు డైరెక్టర్ వినాయక్. ముఖ్యంగా నందమూరి ఫ్యామలీ నుంచి.. బాలకృష్ణ, ఎన్టీఆర్ కు పవర్ ఫుల్ కథలతో.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు రూపొందించాడు స్టార్ డైరెక్టర్. ఇక ఈయన తెరకెక్కించిన సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమా చెన్నకేశవరెడ్డి.  2002లో రిలీజ్ అయిన ఈ సినిమాలో బాలకృష్ణ భార్యగా టబు నటించగా.. ఆయన చెల్లెలిగా తమిళ తార దేవయాని నటించారు. 

అయితే ఈసినిమాకు సబంధించిన కొన్ని విషయాలను రీసెంట్ గా తెరవెనుక కథలు ప్రోగ్రామ్ లో వి.వి.వినాయక్ వివరంగా చెప్పారు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈసినిమాలో ఎవరికి తెలియని తెరవెనకు కథల చాలా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో డైరెక్టర్ వినాయక్ అప్పటి యంగ్ ఫ్యామిలీ హీరోయిన్ లయను ఏడిపించారట. అసలు చెన్నకేశరెడ్డి సినిమాలో లయ చేయలేదు కదా.. ఆయన లయన్ ఏడిపించడమేంటి అనే అనుమానం ఆడియన్స్ లో రావచ్చు. దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. 

చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో దేవయాని నటించింది.అయితే ఈపాత్ర కోసం లయను సంప్రదించాడట వినాయక్. అప్పుడు హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న లయ.. తనను ఇలా చెల్లెలి పాత్రకోసం అడుగుతున్నారు. నేను హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నాను కదా అని  ఏడ్చేసిందట. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా పనికి రారా అంటూ లయ తన బాధను వెలిబుచ్చిందట.  దాంతో వినాయక్ ఈ ప్రయత్నం విరమించుకున్నారట. అయితే ఈ పాత్ర కోసం మరికొంత మంది హీరోయిన్ లను కూడా వినాయక్ సంప్రదించాడట. దాంతో ఆ పాత్రకోసం దేవయానిని తీసుకున్నాం. ఆ పాత్ర ఆమెకి మంచి పేరు  తెచ్చిపెట్టింది" అని వినాయక్ చెప్పుకొచ్చాడు.

అంతే కాదు ఈ సినిమాలో బాలయ్య  హీరోయిన్ గా  టబు నటించింది. కాని ఈ పాత్ర కోసం హీరోయిన్ సౌందర్య అయితే బాగుంటుందని అనుకుని ఆమెకి కథ కూడా వినిపించారట వినాయక్. కథ విన్న తరువాత తాను ఈ ప్రాజెక్టు చేయలేనని సౌందర్య చెప్పారట.  ఈ సినిమా చివరలో హీరోయిన్ వయసుమళ్లిన లుక్ తో కనిపించవలసి ఉంటుంది. అందులోను యంగ్ బాలయ్యకు తల్లిగా కనిపించాలి. దాంతో తాను అలా కనిపించలేనంటూ సౌందర్య ఈ సినిమాను  తిరస్కరించిందట. 

click me!