నాగార్జున నెక్ట్స్ సినిమా ఫైనల్‌.. రిస్క్ చేస్తున్నాడు.. కానీ డిజప్పాయింట్‌ చేయడుగా?

Published : Dec 17, 2022, 08:59 AM ISTUpdated : Dec 17, 2022, 09:01 AM IST
నాగార్జున నెక్ట్స్ సినిమా ఫైనల్‌.. రిస్క్ చేస్తున్నాడు.. కానీ డిజప్పాయింట్‌ చేయడుగా?

సారాంశం

నాగార్జున కొత్త సినిమా ఆల్మోస్ట్ ఖరారైంది. వరుసగా యాక్షన్‌ మూవీస్‌ చేస్తున్న ఆయన ఈ సారి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్నారట. ఈ సారి ఫ్యాన్స్ ని డిజప్పాయింట్‌ చేయకూడదని ఫిక్స్ అయ్యారట. 

నాగార్జున ఇటీవల `ది ఘోస్ట్` చిత్రంతో వచ్చారు. ప్రవీణ్ సత్తారు రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డీలా పడిపోయింది. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నాగ్‌ సినిమాలు ఇటీవల వరుసగా నిరాశ పరుస్తున్నాయి. నేపథ్యంలో రూట్‌ మార్చారట నాగ్‌. మంచి ఎంటర్‌టైనింగ్‌ మూవీ చేయాలనుకుంటున్నారట. `బంగార్రాజు` తర్వాత కమర్షియల్‌ ఎలిమెంట్లు, యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్లు ఉండేలా చూసుకుంటున్నారట. 

అందులో భాగంగా రైటర్‌ బెజవాడ ప్రసన్న కుమార్‌తో ఓ సినిమా చేస్తున్నారు. అనేక సూపర్‌ హిట్‌ చిత్రాలకు రైటర్స్ గా పనిచేసిన ప్రసన్న కుమార్‌ నాగ్‌ మూవీతో దర్శకుడిగా మారబోతున్నారు. ప్రస్తుతం ప్రసన్న `ధమాకా` సినిమాకి రైటర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రసన్న కూడా ఇటీవల తన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ సినిమా మలయాళంకి రీమేక్‌ అనే టాక్ వినిపించింది. `పొరింజు మరియం జోస్‌` సినిమాకి రీమేక్‌ అనే వార్తలు వినిపించిన నేపథ్యంలో అందులోనిజం లేదని తెలిపారు. తన సొంత కథతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. 

ఇదిలా ఉంటే తాజాగా నిర్మాత ఫైనల్‌ అయ్యారట. శ్రీనివాస చిట్టూరి తన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రసన్న `ధమాకా` బిజీలో ఉన్నారు. ఆ సినిమా రిలీజ్‌ అయి, ఆ హడావుడి పూర్తయ్యాక నాగ్‌ సినిమాపై ఫోకస్‌ పెడతారని, వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఆ సినిమాని స్టార్ట్ చేయనున్నారని టాక్‌. 

నాగార్జునకి `సోగ్గాడే చిన్ని నాయన` తర్వాత ఆ స్థాయి హిట్‌ పడలేదు. దీంతో అభిమానులు నిరాశతో ఉన్నారు. ఫ్యాన్స్ ని డిజప్పాయింట్‌ చేయడంలో కింగ్‌ నువ్వే అంటూ కామెంట్లు పెట్టే స్థాయిలో నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నాగ్‌కి ఇప్పుడు హిట్‌ అనివార్యమైంది. ఈ మరి ప్రసన్న సినిమాతోనైనా హిట్‌ అందుకుంటాడా? అనేది చూడాలి. అదే సమయంలో రైటర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రిస్క్ చేస్తున్నారు నాగ్‌. ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తికరంగా మారింది. 

ఇదిలా ఉంటే నాగ్‌ ప్రస్తుతం `బిగ్‌ బాస్‌ తెలుగు 6`షోకి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. రేపటి(ఆదివారం)తో ఈ షో పూర్తవుతుంది. ఇకపై ఆయన బిగ్‌ బాస్‌ షోకి హోస్ట్ గా చేయబోరని తెలుస్తుంది. ఆరో సీజన్‌ రేటింగ్ దారుణంగా పడిపోవడం, కంటెస్టెంట్ల ఎలిమినేషన్‌ అన్‌ పెయిర్‌గా ఉండటం, ఆడియెన్స్ నుంచి విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఆయన ఈ షోకి గుడ్‌ బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Allu Arjun `డాడీ` మూవీ చేయడం వెనుక అసలు కథ ఇదే.. చిరంజీవి అన్న ఆ ఒక్క మాటతో
Bigg Boss Telugu 9: లవర్‌కి షాకిచ్చిన ఇమ్మాన్యుయెల్‌.. కప్‌ గెలిస్తే ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా.. తనూజ ఆవేదన