నాగార్జున N కన్వన్వెన్షన్ భూవి విలువెంత..? ఎకరాకు అంత పలుకుతుందా...?

By Mahesh JujjuriFirst Published Aug 27, 2024, 8:35 PM IST
Highlights

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అంటే.. కింగ్ నాగర్జున ఎన్ కన్వెన్షన్ మాత్రమే.. వైరల్ అవుతున్న ఈ ఎన్ కన్వెన్షన్ విలువ ఎంత..? ఈ హాల్ లో ఏదైనా ఫంక్షన్ చేస్తే ఎంత వసూలు చేస్తారో తెలుసా..? 

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపించే హాట్ హాట్ వార్త ఒక్కటే.. కింగ్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్.. కూల్చివేత. నాగార్జున మాదాపూర్ సమీపంలో హైటెక్ సిటీకి దగ్గర తుమ్మిడి చెరువు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ నిర్మించారని  ఆరోపణలు. అయితే ఇవి ఇప్పటివి కాదు.. అది కట్టినప్పటి నుంచి.. అది చెరువు ఆక్రమిత భూమి అని కోర్టు కేసులు, నోటీసులు ఇలా నడుస్తూనే ఉన్నాయి. అయితే వచ్చిన ఏ సర్కారు.. దాని జోలికి వెళ్ళలేదు. ఈ వివాదం  పది సంవత్సరాలుగా నడుస్తున్నా.. ఎవరు దాన్ని కూల్చేసాహసం చేయలేదు. 

ఇక  ఈవివాదానికి  రేవంత్ రెడ్డి సర్కార్ ముగింపు పలకడంతో మరింత హాట్ టాపిక్ అయింది. అయితే మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం. ఈ ఎన్ కన్వెన్షన్ భూమిలో పది ఎకరాలు ఉంటే.. అందులో మూడు ఎకరాలు చెరువును ఆక్రమించి కట్టారట. ఇక సోషల్ మీడియాలో మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఈ కాస్లీ  హాల్   ఏదైనా పార్టీ కాని.. ఫంక్షన్ కాని జరిగితే.. ఒక్కో ఫంక్షన్ కు 50 లక్షల నుంచి కోటి రూపాయలు తీసుకుంటారట. 

Latest Videos

అంతే కాదు ఎన్ కన్వెన్షన్ హాల్  ఉన్న చోట భూవి విలువ కూడా భారీగా ఉందట. ఇక అక్కడ  ఎకరా భూమి ధర దాదాపుగా  100 కోట్ల నుంచి 150 కోట్లకుపైనే ఉందని తెలుస్తోంది. ఇక ఈరకంగా చూసుకుంటే.. నాగార్జున ఆక్రమించారు అని ఆరోపణలు ఎదురుకుంటున్న సదరు భూమి విలువ దాదాపు 500 కోట్ల వరకూ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకూ నిజం అనేది తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం గట్టిగా వార్త వైరల్ అవుతోంది. 

click me!