తల్లీ కూతురుతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన ఏకైకా హీరో ఎన్టీ రామారావు.. ఆ హీరోయిన్లు ఎవరంటే..?

By Mahesh Jujjuri  |  First Published Aug 27, 2024, 7:37 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్ తో తండ్రీ కొడుకులు హీరోలుగా నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి  కాని.. హీరోయిన్లు అయిన తల్లీ కూతురుతో ఒకే హీరో నటించిన హీరోగా ఒక్క ఎన్టీరామారావుకే ఆ రికార్డ్ దక్కింది. ఇంతకీ ఎవరా హీరోయిన్లు..
 


ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో వింతలు విచిత్రాలు చూస్తుంటాం. అందులో ఒకే హీరోయిన్ తో తండ్రీ.. కొడుకు ఇద్దరు రొమాన్స్ చేసిన సందర్భాలు కోకొల్లలు. చిరు చరణ్, బాలయ్య, ఎన్టీఆర్,  నాగార్జున, చైతన్య,  ఇలా తండ్రి కొడుకులు ఒకే హీరోయిన్ తో ఆడిపాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే విచిత్రంగా తల్లీ కూతురు హీరోయిన్ గా ఒకే హీరో సరసన నటించిన సందర్బాలు మాత్రం లేవు. కాని తెలుగు సినిమా చరిత్రలో ఈ రికార్డ్ ఒక్క హీరోకు మాత్రమే సాధ్యం అయ్యంది. ఆయన ఎవరో కాదు ఎన్టీఆరామారవు. ఇంతకీ ఆ తల్లీ కూతురు హీరోయిన్లు ఎవరో తెలుసా..? 

వాళ్ళు ఎవరో కాదు.. జయచిత్ర ఆమె తల్లి అమ్మాజి.  అవును జయచిత్ర తల్లి అమ్మాజి కూడా హీరోయిన్ నే. ఆమెను అప్పట్లో జయశ్రీ అని కూడా పిలిచేవారు. అయితే వీరిద్దరు అన్న నందమూరి తారకరామారావు తో హీరోయిన్లు గా నటించారు. ఇప్పటి తరంలో కూడా కూడా తల్లీ కూతురు హీరోయిన్లు గా ఉన్నారు కాని.. ఒక్క హీరోతో వారు నటిచలేదు. సారిక, శృతీహాసన్, శ్రీదేవి జాన్వీ కపూర్.. ఇలా తల్లీ కూతురు  హీరోయిన్లు అయిన సందర్భాలు ఉన్నాయి కాని.. ఒక్క హీరోతో తల్లీ కూతురు నటించడం మాత్రం ఒక్క రామారావుతో మాత్రమే సాధ్యం అయ్యింది. 

Latest Videos


అమ్మాజీ అలియాస్ జయశ్రీ తెలుగులో రోజులు మారాయి.. దైవబలం లాంటి సినిమాలలో నటించారు. అయితే ఈ ఇద్దరితోను సీనియర్ ఎన్టీఆర్ రొమాన్స్‌ చేసి ఓ అరుదైన రికార్డు సృష్టించారు. ఇక అమ్మాజీ కూతురు జ‌య‌చిత్ర 1976 లో వచ్చిన మా దైవం సినిమాతో మొదటిసారిగా ఎన్టీఆర్ తో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమాలో రామారావు ఒక జైలర్ పాత్రలో కనిపించారు.. ముద్దాయిల‌ను మంచివాళ్లను చేయవచ్చు అని రామారావు నమ్ముతారు.. అంతేకాదు నేరాలు చేసిన వారిని జైలుకు తీసుకువచ్చి వారిని మంచి వాళ్ళని చేసి వారి జీవితాల్లో వెలుగు నింపుతారు.

ఇక అంతకంటే ముందు 1959లో దైవబలం అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో జయ చిత్రా తల్లి జయశ్రీ అలియాస్ అమ్మాజీ తో ఎన్టీఆర్ నటించారు.  పొన్నలూరు వసంత కుమార్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో  నిర్మించిన ఈమూవీ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డ్ కూడా చేరింది. ఆతరువాత కాని.. అంతకు ముందు కాని ఇలాంటి సందర్భం ఫిల్మ్  ఇండస్ట్రీలోనే లేదు అని చెప్పాలి. 

click me!