ఆడవాళ్లే ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండేవాడ్ని.. నాగార్జున కామెంట్స్!

Published : Sep 24, 2018, 05:07 PM IST
ఆడవాళ్లే ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండేవాడ్ని.. నాగార్జున కామెంట్స్!

సారాంశం

బిగ్ బాస్ షోలో సినిమాలను ప్రమోట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గరవుతున్న ప్రతి సినిమా తన ప్రమోషన్ కోసం బిగ్ బాస్ షోని వాడుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ షోకి 'దేవదాస్' సినిమా టీమ్ వచ్చింది. 

బిగ్ బాస్ షోలో సినిమాలను ప్రమోట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గరవుతున్న ప్రతి సినిమా తన ప్రమోషన్ కోసం బిగ్ బాస్ షోని వాడుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ షోకి 'దేవదాస్' సినిమా టీమ్ వచ్చింది. నాగార్జున, నాని నటిస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. నాని ఎలాగో హోస్ట్ కాబట్టి నాగార్జున కూడా షోకి వచ్చారు.

ఆదివారం ఎపిసోడ్ లో నాగ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. గన్ పట్టుకొని వచ్చిన నాగార్జున 'ఏంటి మా దాస్(నాని) ని ఎవరో ఇబ్బంది పెడుతున్నారంట' అని హౌస్ మేట్స్ ని అడిగారు. దానికి నాని అందరూ ఇబ్బంది పెడుతున్నారని(నవ్వుతూ) హౌస్ లో ఉన్న సభ్యులను చూపిస్తూ అన్నారు.

ఆ తరువాత వెంటనే.. మీరంతా ఎన్ని రోజుల నుండి ఈ హౌస్ లో ఉన్నారని నాగార్జున హౌస్ మేట్స్ ని అడగగా.. వారు 106 రోజులని చెప్పారు. ఇన్ని రోజులు ఎలా ఉండగలిగారంటూ ప్రశ్నించిన నాగార్జున.. తానైతే ఒక్కరోజు కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉండేవాడిని కాదని చెప్పారు.

అయితే హౌస్ లో తనతో పాటు ఐదుగురు ఆడవాళ్లు ఉంటే మాత్రం ఉండేవాడినేమో అని సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత హౌస్ మేట్స్ కి 'దేవదాస్' ట్రైలర్ ని చూపించారు. అయితే వయసు మీదపడుతున్నా నాగార్జున మాత్రం ఇలాంటి కొంటె వ్యాఖ్యలు చేయడం ఆపడం లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సపోర్ట్ తో సోషల్ మీడియాలోకి పవన్ భార్య.. 1800 కోట్ల ఆస్తి వదిలేసి ఇండియాకి ఎందుకు వచ్చిందో తెలుసా ?
Balakrishna: నా లెవల్ ఏంటి, కొడుకు కోసం ఇంత ద్రోహం చేస్తారా..దుమ్మెత్తి పోసిన సీనియర్ నటుడు