మహానటి ఎఫెక్ట్.. ఐ హేట్ యూ అనేశారు!

Published : Sep 24, 2018, 04:45 PM ISTUpdated : Sep 24, 2018, 04:50 PM IST
మహానటి ఎఫెక్ట్.. ఐ హేట్ యూ అనేశారు!

సారాంశం

 జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ కనిపించిన తీరుకు కామెంట్స్ ఒక రేంజ్ లో వచ్చాయట. కొందరైతే ఏకంగా దుల్కర్ ని తిట్టేశారట. అంతగా ఆ పాత్రకు యువ హీరో న్యాయం చేశాడని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దుల్కర్ కొన్ని కామెంట్స్ గురించి మాట్లాడాడు.

 

మహానటి సావిత్రి బయోపిక్ అందించిన విజయం నటీనటులందరికి ఎంతటి గుర్తింపును అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అంతకుముందు వరకు ఒక హీరోయిన్ బయోపిక్ ని ప్రేక్షకులు ఆ స్థాయిలో ఆదరిస్తారు అని ఎవరు ఊహించలేకపోయారు. ఇక అప్పటివరకు కీర్తి సురేష్ అంటే అందమైన హీరోయిన్ మాత్రమే. కానీ మహానటి లో ఆమె నటన చూసిన తరువాత నటనలో కూడా అందాన్ని చూపించిన హీరోయిన్ అని టాక్ వచ్చింది. 

దుల్కర్ సల్మాన్ కి కూడా సినిమా ద్వారా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ కనిపించిన తీరుకు కామెంట్స్ ఒక రేంజ్ లో వచ్చాయట. కొందరైతే ఏకంగా దుల్కర్ ని తిట్టేశారట. అంతగా ఆ పాత్రకు యువ హీరో న్యాయం చేశాడని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దుల్కర్ కొన్ని కామెంట్స్ గురించి మాట్లాడాడు. అన్ని సినిమాల్లో ఒకే విధంగా నటిస్తే ఏం లాభం అని మహానటిలో నెగిటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ నట్టించడానికి ఒప్పేసుకున్నాడట. 

అయితే కొంత మంది లేడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సినిమా చూసి ఐ హేట్ యూ దుల్కర్ అంటూ కామెంట్స్ పెట్టారని వివరించాడు. అది నెగిటివ్ రోల్ అయినా కూడా సినిమాలో చాలా కీలకమైన పాత్ర. నేను చేసే సినిమా హిట్టవ్వాలని కాదు.. మంచి సినిమాలో నేను ఉండాలని అనుకుంటా.. ఆ ఆలోచనతోనే మహానటి సినిమా చేశాను అని దుల్కర్ తెలిపాడు. 

 

 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఈ వారం ఓటీటీ రిలీజ్‌⁠లు ఇవే.. సంచలనం సృష్టించిన చిన్న సినిమా, తప్పక చూడాల్సిన థ్రిల్లర్స్ రెడీ
Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే