దేవదాస్ హిట్ కొడతాడా..? ఇన్సైడ్ టాక్!

Published : Sep 24, 2018, 04:44 PM IST
దేవదాస్ హిట్ కొడతాడా..? ఇన్సైడ్ టాక్!

సారాంశం

అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి నటించిన చిత్రం 'దేవదాస్'. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అదే రేంజ్ లో సినిమా బిజినెస్ కూడా జరిగింది. 

అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి నటించిన చిత్రం 'దేవదాస్'. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అదే రేంజ్ లో సినిమా బిజినెస్ కూడా జరిగింది. అయితే ఈ సినిమా విడుదలైన రెండు వారాల గ్యాప్ లో 'అరవింద సమేత', దానికంటే ముందుగా 'నోటా' సినిమాలు విడుదల కానున్నాయి.

సో కలెక్షన్స్ సంపాదించడానికి 'దేవదాస్' టీమ్ కి ఒక వారం మాత్రమే సమయముంది. అంటే ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ వస్తేనే తప్ప బయ్యర్లు గట్టెక్కరు. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాను కొందరు ఇండస్ట్రీ వ్యక్తులను షో వేసి చూపించినట్లు తెలుస్తోంది.

నాగార్జున పేరుకి మాఫియా డాన్ అయినప్పటికీ ఆద్యంతం తన కామెడీతో నవ్విస్తారని సమాచారం. అంతేకాదు మాఫియా బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన సన్నివేశాలు చాలా తక్కువగా ఉంటాయట. ఇక సెకండ్ హాఫ్ లో నాని కామెడీ సీన్స్ బాగా పేలాయని అంటున్నారు. తమిళ నటుడు శరత్ కుమార్ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?