ChaySam Divorce: మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 27, 2022, 10:00 PM IST
ChaySam Divorce: మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

సారాంశం

టాలీవుడ్ క్రేజీ కపుల్స్ నాగ చైతన్య, సమంత గతేడాది విడిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి చర్చ జరుగుతోంది. మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి.

టాలీవుడ్ క్రేజీ కపుల్స్ నాగ చైతన్య, సమంత గతేడాది విడిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి చర్చ జరుగుతోంది. మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. విభేదాల కారణంగా గతేడాది చైతు, సమంత విడిపోయారు. తామిద్దరం విడాకులు తీసుకుంటున్నట్లు అక్టోబర్ లో ప్రకటించారు. 

సమంత, చైతు ఎందుకు విడిపోయారు, వారిద్దరి మధ్య ఏం జరిగింది అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్త కథనాలు ప్రసారం అయ్యాయి. ఇప్పటికి ఇటు నాగ చైతన్య, అటు సమంత ఏం చేసిన సోషల్ మీడియాలో క్షణాల్లో న్యూస్ వైరల్ అయిపోతోంది. 

నాగ చైతన్య,నాగార్జున కలసి నటించిన బంగార్రాజు చిత్రం సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల కోసం నాగార్జున, చైతు అనేక ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలలో సమంత, నాగ చైతన్య విడాకుల గురించి నాగార్జున మాట్లాడినట్లు బాలీవుడ్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. 

తాజాగా సమంతే మొదట విడాకులు కోరిందని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.  ఈ న్యూస్ వైరల్ గా మారడంతో నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు. సమంత, నాగ చైతన్య గురించి నేను చెప్పినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. 

వారిద్దరి గురించి తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని నాగార్జున తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే బంగార్రాజుతో హిట్ కొట్టిన నాగ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఘోస్ట్ చిత్రంలో నటిస్తున్నాడు. బంగార్రాజు చిత్రంలో తండ్రి కొడుకులు ఇద్దరూ పోటీపడి నటించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యో- కిడ్నాప్ ప్లాన్‍తో రూ. 30 కోట్లు డిమాండ్
Brahmastra 2: వార్ 2 డైరెక్టర్ మరో భారీ ప్లాన్, ఈ మీటింగ్‌తో పెరిగిన ఊహాగానాలు