'ఒకే ఒక జీవితం'లో అమల నటనకి నాగార్జున కంటతడి.. ఎమోషనల్ అయిన అఖిల్

Published : Sep 07, 2022, 05:08 PM IST
'ఒకే ఒక జీవితం'లో అమల నటనకి నాగార్జున కంటతడి.. ఎమోషనల్ అయిన అఖిల్

సారాంశం

యువ హీరో శర్వానంద్ విభిన్నమైన అటెంప్ట్ తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఒకే ఒక జీవితం'. ఈ చిత్రం టైం ట్రావెల్ నేపథ్యంలో ఉండబోతోంది. 

టాలీవుడ్ లో ఇటీవల విడుదలవుతున్న చిత్రాలకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. వైవిధ్యం, వినోదం ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. పాత చింతకాయ పచ్చడి అన్నట్లుగా ఉండే చిత్రాలని పక్కన పెట్టేస్తున్నారు. బింబిసార, సీతారామం, కార్తికేయ 2 చిత్రం ఘనవిజయం సాధించాయి. మాచర్ల నియోజకవర్గం, లైగర్ లాంటి చిత్రాలు చతికిలబడ్డాయి. 

యువ హీరో శర్వానంద్ విభిన్నమైన అటెంప్ట్ తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఒకే ఒక జీవితం'. ఈ చిత్రం టైం ట్రావెల్ నేపథ్యంలో ఉండబోతోంది. హృదయాన్ని హత్తుకునేలా మదర్ సెంటిమెంట్ కూడా ఈ చిత్రంలో ఉండనుంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు. అక్కినేని అమల చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించింది. రీతూ వర్మ ఫీమేల్ లీడ్ గా నటించింది. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకుడు. 

సెప్టెంబర్ 9న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా సెలెబ్రిటీల కోసం హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించారు. స్పెషల్ స్క్రీనింగ్ కి నాగార్జున, అమల, అఖిల్ తో పాటు మరికొందరు సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. 

సినిమా చూసిన అనంతరం నాగార్జున అమల నటనకి కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక అఖిల్ కూడా తన తల్లి నటనకి ఎమోషనల్ అయ్యాడట. సినిమా అద్భుతంగా ఉందని నాగ్ చిత్ర యూనిట్ ని ప్రశంసించినట్లు తెలుస్తోంది. 

వీరితో పాటు కార్తికేయ 2 డైరెక్టర్ చందు ముండేటి, సీతారామం దర్శకుడు హను రాఘవపూడి, ఇతర యువ దర్శకులు స్పెషల్ స్క్రీనింగ్ వీక్షించారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. 

PREV
click me!

Recommended Stories

Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌
Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?