నన్ను కలవాలి తమ్ముడూ అన్నారు.. ఆలోపే..

Published : Aug 29, 2018, 10:07 AM ISTUpdated : Sep 09, 2018, 01:07 PM IST
నన్ను కలవాలి తమ్ముడూ అన్నారు.. ఆలోపే..

సారాంశం

ఎమోషనల్ ట్వీట్ చేసిన నాగార్జున

సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ హరికృష్ణ ఆకస్మిక మరణం సినీ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో తమ సంతాపన్ని తెలియజేస్తున్నారు. ‘కొన్ని వారాల క్రితమే ఆయన నాతో.. నిన్ను చూసి చాలా రోజులయింది, కలవాలి తమ్ముడు అని అన్నారు. ఇప్పుడు ఆయన ఇక లేరు. మిస్‌ యూ అన్న’ అంటూ హీరో నాగార్జున ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేశారు.

‘‘ఈ వార్త వినడం చాలా బాధ కలిగించింది. ఈ విషాదాన్ని అధిగమించడానికి తారక్‌, కళ్యాణ్‌తో పాటు కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించాలని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని నటి కాజల్ ట్వీట్ చేశారు.

read more news

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ మృతి ( వీడియో)

ప్రజల్లో చెరగని ముద్ర... హరికృష్ణ రాజకీయ ప్రస్థానం

రోడ్డు ప్రమాదంలో హరిక్రిష్ణ దుర్మరణం (ఫోటోలు)

బాబుతో హరికృష్ణకు విబేధాలు, ఎందుకంటే?

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?