ఇంటిసభ్యుల బిగ్‌ ట్రీట్ కి నాగార్జున కన్నీళ్లు‌.. హాట్‌ డాన్స్ తో రెచ్చిపోయిన ప్రియాంక..

Published : Oct 03, 2021, 11:38 PM IST
ఇంటిసభ్యుల బిగ్‌ ట్రీట్ కి నాగార్జున కన్నీళ్లు‌.. హాట్‌ డాన్స్ తో రెచ్చిపోయిన ప్రియాంక..

సారాంశం

ఇంటిసభ్యులు నాగార్జునకి బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆయన నటించిన `నిన్నే పెళ్లాడతా` సినిమా 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమాలోని పాటలకు డాన్సులు వేశారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి, విడి విడిగా, పెయిర్‌లుగా విడిపోయి చేసిన డాన్సులు అబ్బురపరించారు. 

బిగ్‌బాస్‌5 ఆదివారం ఎపిసోడ్‌ ఆద్యంతం సందడిగా, ఫన్నీగా సాగింది. ఎలిమినేషన్‌ ప్రక్రియ ఉత్కంఠకి గురి చేసింది. కానీ మిగిలిన ఎపిసోడ్‌ మొత్తం సరదాగా సాగిందని చెప్పొచ్చు. ఎపిసోడ్‌ ప్రారంభంలోనే ఇంటిసభ్యులు నాగార్జునకి బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆయన నటించిన `నిన్నే పెళ్లాడతా` సినిమా 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమాలోని పాటలకు డాన్సులు వేశారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి, విడి విడిగా, పెయిర్‌లుగా విడిపోయి చేసిన డాన్సులు అబ్బురపరించారు. ఇవన్నీ చూసి నాగార్జున ఫిదా అయ్యారు. అంతేకాదు కళ్లల్లో నీళ్లు తిరిగాయని స్వయంగా నాగే చెప్పడం విశేషం. 

ఆ తర్వాత గెస్‌ చేసే గేమ్‌ పెట్టాడు నాగ్‌. శ్రీరామ్‌, మానస్‌ టీమ్‌లు ఈ పోటీలో పాల్గొన్నారు. సినిమా పేర్లని గెస్ చేయాల్సి ఉంది. ఇందులో శ్రీరామ్‌ టీమ్‌ సక్సెస్‌ అయ్యింది. అయితే ఈ క్రమంలోనే విశ్వ, ప్రియాంకలు కలిసి చేసిన డాన్సు కనువిందు చేసింది. ముఖ్యంగా ఇందులో ప్రియాంక చేసిన హాట్‌ డాన్సు మెస్మరైజ్‌ చేసింది. ప్రియాంకలోని ఇలాంటి యాంగిల్‌ కూడా ఉందా? అనేలా సర్‌ప్రైజ్‌తో కూడా షాక్‌ ఇచ్చింది. వీరితోపాటు సిరి, అనీ మాస్టర్‌, యాంకర్‌ రవి, హమీద, శ్రీరామ్‌లు కూడా అద్భుతంగా డాన్స్‌ చేసి సందడి చేశారు. 

మరోవైపు `దాక్కో దాక్కో మేక` గేమ్‌ పెట్టాడు. ఇందులో ఒకరు మేక, ఒకరు పులి. పులికి దొరికితే మేక ఖతం. ఈ గేమ్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది. అయితే ఇందులో మానస్‌, ప్రియాంకలు కలిసి పరిగెత్తే సమయంలో మానస్‌ స్విమ్మింగ్‌ ఫూల్‌లో పడటం అందరిని షాక్‌కి గురి చేసింది. కానీ ఏం గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇందులోనూ జంటలుగా డాన్సులు చేసి కనువిందు చేశారు ఇంటి సభ్యులు. 

ఇక ఎలిమినేషన్‌ ప్రక్రియలో నిన్న శనివారం ఎపిసోడ్‌లో ప్రియా, కాజల్‌, రవి, సన్నీ సేవ్‌ అయ్యారు. ఆదివారం ఎపిసోడ్‌లో సిరి, అనీ మాస్టర్‌, లోబో, నటరాజ్‌ మాస్టర్‌ ఉన్నారు. వీరిలో మొట అనీ మాస్టర్‌, ఆ తర్వాత సిరి సేవ్‌ అయ్యారు. చివరగా లోబో, నటరాజ్‌ మధ్య ఎలిమినేషన్‌ ప్రక్రియ ఉత్కంఠకి గురి చేసింది. ఇందులో ఫైనల్‌గా లోబో సేవ్‌ అయ్యారు. నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యారు. ఆయన వెళ్లిపోవడంతో ఇంటిసభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. స్టేజ్‌పై ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని కదిలించింది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి