అఖిల్, జైనబ్ బ్యూటిఫుల్ వెడ్డింగ్ ఫోటోస్.. నాగార్జున ఎమోషనల్ పోస్ట్ వైరల్

Published : Jun 06, 2025, 09:07 PM IST
Akhil Akkineni Wedding

సారాంశం

నాగార్జున అఖిల్ పెళ్లి ఫోటోలని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఓ ఇంటివాడైన అఖిల్ 

అక్కినేని ఫ్యామిలీ యువ వారసుడు అఖిల్ అక్కినేని వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం తెల్లవారుజామున అఖిల్, జైనబ్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. గత ఏడాది నవంబర్ లో అఖిల్, జైనబ్ నిశ్చితార్థం ప్రైవేట్ వేడుకగా సింపుల్ గా జరిగింది. 

త్వరలో రిసెప్షన్ వేడుక 

కాగా శుక్రవారం జరిగిన వివాహ వేడుక వైభవంగా జరిగింది. సినీ రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. జూన్ 8న రిసెప్షన్ వేడుకని నాగార్జున ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేశారట. ఈ వేడుకకి టాలీవుడ్ మొత్తం హాజరు కానున్నట్లు టాక్. అదే విధంగా రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతారు. 

తాజాగా నాగార్జున అఖిల్ పెళ్లి ఫోటోలని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అఖిల్ పెళ్లి గురించి నాగార్జున సంతోషంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

అఖిల్ పెళ్లిపై నాగార్జున ఎమోషనల్ కామెంట్స్ 

నాగార్జున ట్విట్టర్ లో.. 'నేను, అమల ఉప్పొంగే సంతోషంతో ఈ శుభవార్తని పంచుకుంటున్నాం. మా తనయుడు అఖిల్ అక్కినేని, జైనబ్ ఎంతో అందంగా జరిగిన వివాహ వేడుకతో ఒక్కటయ్యారు. మా ఇంట్లోనే ఈ వేడుక జరిగింది. అఖిల్ పెళ్లి వేడుకతో మా కల సాకారమైంది. కొత్త జంటకి మీ అందరి ఆశీర్వాదం కావాలి' అని పేర్కొన్నారు. 

అఖిల్ వివాహం చేసుకున్న జైనబ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె తండ్రి జుల్ఫీ ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరని తెలుస్తోంది. వ్యాపార రంగంలో నాగార్జునకి ఉన్న పరిచయాల కారణంగా జుల్ఫీ, అక్కినేని కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ విధంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న అఖిల్, జైనబ్ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు
Bayilone Ballipalike : దుమ్ములేపుతున్న మంగ్లీ ఫోక్ సాంగ్, 10 రోజుల్లోనే ఎన్ని కోట్ల వ్యూస్ రాబట్టిందంటే?