హీరోల కంటే హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్.. బాలీవుడ్‌పై వామికా గబ్బీ సంచలన వ్యాఖ్యలు

Published : Jun 06, 2025, 07:03 PM IST
హీరోల కంటే హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్.. బాలీవుడ్‌పై వామికా గబ్బీ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

బాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్ల రెమ్యునరేషన్ తేడాపై వామికా గబ్బీ ప్రశ్నించారు. ఫ్లాప్ సినిమాల తర్వాత కూడా హీరోల రెమ్యునరేషన్ ఎందుకు తగ్గదని, హీరోయిన్ల రెమ్యునరేషన్ మాత్రం ఎందుకు తగ్గిస్తారని ఆమె అడిగారు.  

బాలీవుడ్ లో వామికా గబ్బీ తన గ్లామర్ తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఆమె తరచుగా వార్తల్లో నిలుస్తోంది.  సినిమా రంగంలో రెమ్యునరేషన్ వ్యత్యాసంపై నటి వామికా గబ్బీ మాట్లాడారు. హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా వాళ్ళ రెమ్యునరేషన్ ఎందుకు తగ్గదని, హీరోయిన్ల జీతాలు మాత్రం తగ్గిస్తారని ఆమె ప్రశ్నించారు.

హీరోల వల్లే సినిమాలు నడుస్తాయా?

ఓ ఇంటర్వ్యూలో వామికా రెమ్యునరేషన్ అసమానతల గురించి గళం విప్పారు. హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు తక్కువ జీతం ఇస్తున్నారని ఆమె అన్నారు.

"ఒకరికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం, ఒకరికి తక్కువ ఇవ్వడం నన్ను బాధించదు. ఎందుకంటే ఎవరి ప్రతిభకు తగ్గట్లుగా వారికీ జీతాలు ఉంటాయి. కానీ కేవలం మహిళని అనే కారణంతో హీరోల కంటే తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం బాధిస్తోంది. హీరోలు ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షిస్తారని వాదిస్తారు, కానీ హీరోయిన్ లేకుండా సినిమా ఉండదు. హీరోలకు చాలా డబ్బు ఇస్తారు, సినిమా ఫ్లాప్ అయినా వాళ్ళ జీతాలు ఎందుకు తగ్గవు?"


 

 

సైడ్ బిజినెస్ చేయనున్న వామికా?

రెమ్యునరేషన్ తేడాను వేరే విధంగా పూడ్చుకోవాలని వామికా అనుకుంటున్నారు. "డబ్బు సంపాదించడానికి వేరే మార్గాలు చూస్తున్నా. నాకు సంతోషాన్నిచ్చే, రెమ్యునరేషన్ తేడాను తగ్గించే క్రియేటివ్ మార్గాలు చూస్తున్నా" అని ఆమె అన్నారు. జీతాలలో తేడా ఉందని ఒప్పుకుంటున్నప్పటికీ, హీరోయిన్ లేకుండా సినిమా ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు.

ప్రస్తుతం వామికా వయసు 31 ఏళ్ళు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను పైగా చిత్రాలు ఉన్నాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తోంది. తెలుగులో అడివి శేష్ జి2 చిత్రంలో నటిస్తోంది.  

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు