
గతేడాది అక్కినేని నాగార్జున కుటుంబం అంతా సందడి సందడిగా కనిపించింది. నాగచైతన్య, అఖిల్ ల వివాహాలు ఖరారు కావడం, ఇద్దరి ఎంగేజ్ మెంట్ పూర్తి కావడడంతో అంతా సంబరాల్లో మునిగి తేలుతున్న సందర్భంలో అఖిల్ వివాహం రద్దు కావటంతో అక్కినేని ఫ్యామిలీ షాక్ కు గురైంది. కుటుంబ సభ్యులంతా గత కొన్ని రోజులుగా తీవ్ర నిరాశతో బాధపడుతున్నారు. ఒక్కసారిగా అక్కినేని ఫ్యామిలీలో సందడి అంతా మాయమైంది. ఎవరూ ఊహించని విధంగా అఖిల్ పెళ్లి ఉన్నట్టుండి రద్దు కావటంతో నాగార్జున చాలా అప్ సెట్ అయ్యారని, సినిమా సెట్స్ లో కూడా ఆయన ప్రవర్తన గతంలో ఎన్నడూ లేని విధంగా విచిత్రంగా ఉంటోందని అంటున్నారు.
ప్రస్తుతం నాగార్జున రాజుగారి గది 2 సినిమాలో చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన మెంటలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు. సెట్స్ లో ఎప్పుడూ సరదాగా ఉండే నాగార్జున ఇపుడు చాలా మూడీగా ఉంటున్నారని, తన షూటింగ్ పోర్షన్ పూర్తవ్వగానే ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఓ మూలన కూర్చుంటూ అదో లోకంలో ఉంటున్నారని తెలుస్తోంది. అంతే కాదు... అఖిల్ వివాహం రద్దు తర్వాత నాగార్జున ఫోన్ నెంబర్ కూడా మార్చారట.
గొడవకు కారణం ఏంటనేది ఇప్పటి వరకు బహిరంగంగా ఎవరూ ప్రకటించలేదు. అక్కినేని కుటుంబానికి సన్నిహితులైన చాలా మంది ఫోన్ చేస్తుండటం వల్లే ప్రస్తుతానికి నాగార్జున నెంబర్ ఆఫ్ లో పెట్టి వేరే నెంబర్ వాడుతున్నట్లు తెలుస్తోంది.
అయినా... సినిమా వాళ్లకు ఇదంతా కామనే అయినా.. నాగార్జున అఖిల్ పెళ్లి రద్దు కావడంపై తీవ్ర మనస్థాపంతో ఉన్నారట. ఓ పక్క కెరీర్ లోనూ ఇంకా అఖిల్ సెట్ కాలేదు. మరో పక్క సడెన్ గా పెళ్లి రద్దు కావటంతో అక్కినేని ఫ్యామిలీ ప్రస్థుతం నిరాశతో ఉంది. ఇక నాగచైతన్య, సమంతల పెళ్లి పరిస్థితి ఏంటోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.