రాంగోపాల్ వర్మకు నాగార్జున సీరియస్ కండిషన్

Published : Nov 09, 2017, 12:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
రాంగోపాల్ వర్మకు నాగార్జున సీరియస్ కండిషన్

సారాంశం

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా మరో మూవీ గతంలో శివ సినిమాతో సంచలనం సృష్టించిన వర్మ, నాగ్ కాంబో ఈ కాంబినేషన్ లో మరో మూవీ, దాని కోసం వర్మకు నాగార్జున కండిషన్స్

28 ఏళ్ల క్రితం శివ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ మొదటి సారి దర్శకత్వం వహించిన.. ‘శివ’ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తిరిగి నాగార్జున నటిస్తూ ఉండటం ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది.

 

వర్మ సినిమాలు ఇటీవల కాలంలో పెద్దగా ఆడింది లేదు. అయినా సరే..వర్మ దర్శకత్వంలో నాగార్జున సినిమాను అంగీకరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈనెల 20 నుండి షూటింగ్ ప్రారంభంకాబోతున్న ఈసినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సీక్రెట్ ను నాగార్జున ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లీక్ చేసాడు. 

 

తన వద్దకు వర్మ మూడు నెలల క్రితమే వచ్చి ఒక మంచికథ చెప్పాడని అయితే ఆకథ తనకు బాగా నచ్చినా ఇతర సినిమాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి తన సినిమాపై మాత్రమే పూర్తి ఫోకస్ పెట్టాలని కండీషన్ తో తాను వర్మ మూవీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పానని అంటున్నాడు నాగార్జున.

 

ఇదే ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు నాగార్జున. ప్రస్తుతం తనజీవితం చాల ఆనందంగా ఉందని తన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్‌ కెరీర్‌లో రాణించడానికి చాలా కష్టపడుతున్నారని.. తన నీడ నుండి బయటపడి తమకు తాముగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నాడు నాగార్జున. 

 

ఇదే సందర్భంలో తన కోడలు సమంత గురించి మాట్లాడుతూ ‘పెళ్లికి ముందే ఆమె మా కుటుంబంలో కలిసిపోయిందని’ చెపుతూ ఒక విషయంలో మాత్రం తేడా వచ్చింది అని అంటున్నాడు. సమంత అంతకు ముందు తనను ‘నాగ్‌ సర్‌' అని పిలిస్తే ఇప్పుడు ‘మామ' అంటోంది అని జోక్ చేసాడు.

 

తన పిల్లల ఆనందం తనకు ముఖ్యం అని చెపుతూ అంతకు మించి ఏమీ తనకు ఏమి కోరికలు లేవు అని అంటున్నాడు నాగ్. అఖిల్‌ నటిస్తున్న ‘హలో' సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతోందని చెప్పాడు. ఈసినిమాతో అఖిల్ మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 

 

ఇటీవల తన 58వ పుట్టినరోజు వేడుకను చాలా చిన్నగా ఫ్యామిలీ గెట్ టు గెదర్ గా జరుపుకున్న విషయాన్ని చెపుతూ ఆ రోజు తన అమ్మా నాన్నలను గుర్తు చేసుకున్న విషయాన్ని తెలియచేసాడు. సినిమాలలో నటించకపోతే తనకు జీవితం బోర్ గా అనిపిస్తుంది అంటూ తనకు ఓపిక ఉన్నంత కాలం నటిస్తూనే ఉంటానని నాగ్ స్పష్టంచేశాడు.

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?