బిగ్‌బాస్‌4 సరికొత్త రికార్డులు.. ముగ్గురిలో ఇద్దరు చూశారట!

Published : Sep 17, 2020, 09:15 PM IST
బిగ్‌బాస్‌4 సరికొత్త రికార్డులు.. ముగ్గురిలో ఇద్దరు చూశారట!

సారాంశం

`బిగ్‌బాస్‌` తెలుగు సీజన్‌ 4 తొలి ఎపిసోడ్‌తో నాగార్జున తన సత్తా చాటారు. ఇప్పటి వరకు తెలుగు `బిగ్‌బాస్‌` చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన షోగా నిలిచింది. `బిగ్‌బాస్‌` చరిత్రలోనే రానటువంటి టీఆర్పీ ఈ షోకి రావడం విశేషం.

తెలుగు టీవీల్లో అత్యంత పాపులర్‌ షో `బిగ్‌బాస్‌`. ప్రస్తుతం నాగార్జున హోస్ట్ గా నాల్గో సీజన్‌ ప్రారంభమైంది. రెండు వారాల క్రితం ప్రారంభమైన ఈ షోపై ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు. కానీ `బిగ్‌బాస్‌4` ఫస్ట్ ఎపిసోడ్‌ మాత్రం రికార్డులు సృష్టించింది. 

`బిగ్‌బాస్‌` తెలుగు సీజన్‌ 4 తొలి ఎపిసోడ్‌తో నాగార్జున తన సత్తా చాటారు. ఇప్పటి వరకు తెలుగు `బిగ్‌బాస్‌` చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన షోగా నిలిచింది. `బిగ్‌బాస్‌` చరిత్రలోనే రానటువంటి టీఆర్పీ ఈ షోకి రావడం విశేషం. `బిగ్‌బాస్‌4` తొలి ఎపిసోడ్‌ ఏకంగా 18.5టీఆర్సీ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దీంతో ఈ షో టాప్‌లో నిలిచింది. 

అంతేకాదు తొలి ఎపిసోడ్‌ని ఏకంగా నాలుగున్నర కోట్ల మంది వీక్షించారు. అంటే మన తెలుగునాట ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ షో చూశారని `బిగ్‌బాస్‌4` యూనిట్‌ తెలిపింది. ఈ మేరకు గురువారం నాగార్జున ఓ పోస్టర్‌ని విడుదల చేసి ధన్యవాదాలు తెలిపారు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటోంది. దీన్ని సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. అయితే మొదటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ ని పరిచయం చేస్తారు. ఎవరెవరు వస్తున్నారని, ఆ విషయంలో అందరిలోనూ ఉత్కంఠ ఉంటుంది. దానివల్లే ఈ సారి రికార్డ్ టీఆర్పీ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా
పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా