గంగవ్వకి కరోనా టెస్ట్?..టెన్షన్‌లో బిగ్‌బాస్‌4 హౌజ్‌?

Published : Sep 17, 2020, 08:51 PM ISTUpdated : Sep 17, 2020, 09:15 PM IST
గంగవ్వకి కరోనా టెస్ట్?..టెన్షన్‌లో బిగ్‌బాస్‌4 హౌజ్‌?

సారాంశం

బిగ్‌బాస్‌4 హౌజ్‌లోని టెక్నీషియ‌న్ల‌కు క‌రోనా రావడంతో ముందు జాగ్ర‌త్త‌గా గంగ‌వ్వ‌కు కూడా ప‌రీక్ష చేయించార‌ట‌. ఆ ఫలితాల కోసం వెయిట్‌ చేస్తున్నారట. 

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌4కి కొత్తగా కరోనా భయం పట్టుకుంది. తాజాగా కొందరు టెక్నీషియన్లకి కరోనా సోకడంతో ఇప్పుడంతా ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇందులో గంగవ్వకి కరోనా సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

నాగార్జున హోస్ట్ గా బిగ్‌బాస్‌ సీజన్‌ 4 గత రెండు వారాల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. 16 మంది కంటెస్టెంట్స్ తో ఈ షోని ప్రారంభించారు. అయితే కంటెస్టెంట్స్ షోలో పాల్గొనడానికి ముందు 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచారు. ఆ తర్వాత టెస్ట్ లు చేసి కరోనా నెగటివ్‌ వచ్చాకే షోని ప్రారంభించారు. కానీ ఇప్పుడు షో సిబ్బందికి కరోనా సోకడం కలకలం సృష్టిస్తుంది. 

ఈ షోకి పనిచేసే కొంత మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందట. అంతేకాదు కంటెస్టెంట్స్ లో గంగవ్వ కూడా కాస్త నీరసంగా ఉంది. ప్రారంభంలో ఉన్నంత ఊపు ఆమెలో కనిపించడం లేదు. మరోవైపు హౌజ్‌లో ఆమె కాస్త అస్వస్థతకి గురైనట్టు తెలుస్తుంది. టెక్నీషియ‌న్ల‌కు క‌రోనా రావడంతో ముందు జాగ్ర‌త్త‌గా గంగ‌వ్వ‌కు కూడా ప‌రీక్ష చేయించార‌ట‌. ఆ ఫలితాల కోసం వెయిట్‌ చేస్తున్నారట. ఈ నేప‌థ్యంలో షో నిర్వ‌హ‌ణ‌కు మ‌రిన్ని క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు బిగ్‌బాస్ యాజ‌మాన్యం సిద్ధ‌మైంది. అంతేకాదు ఇప్పుడు గంగవ్వకి పాటిజివ్‌ వస్తే పరిస్థితేంటి? అనే ఆందోళన ఇప్పుడు అందరిని వెంటాడుతుంది. 

తనలో నీరసం వల్లే ఆమె `నేను వెళ్ళిపోతా బిడ్డా.. `అని పదే పదే అడుగుతోంది. ఆమె కోరికని నాగార్జున పట్టించుకోవడం లేదు. అది ప్రేక్ష‌కుల అభిప్రాయానికే వ‌దిలేస్తున్నా అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన తొమ్మిది మందిలో గంగవ్వ కూడా ఉంది. మరి ఆమె ఉంటుందా? ఎలిమినేట్‌ అవుతుందా? అనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?