`జైలర్ 2`లో విలన్‌గా టాలీవుడ్‌ స్టార్‌ హీరో? బాలయ్య కాకుండా మరో స్టార్‌ని దించుతున్న రజనీకాంత్‌

Published : May 28, 2025, 11:07 PM IST
rajinikanth

సారాంశం

రజనీకాంత్ `జైలర్ 2` సినిమాలో టాలీవుడ్ స్టార్ నాగార్జున విలన్‌గా నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. `జైలర్` సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా వస్తున్న `జైలర్‌ 2`పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  

‘జైలర్ 2` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌

2023లో రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సూపర్‌స్టార్‌ రేంజ్‌ ఏంటో చూపించింది. ఈ మూవీ ఆరు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది.  ఇందులో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా రజనీకాంత్ నటన అదుర్స్. 

రమ్యకృష్ణ, తమన్నా, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ కూడా నటించి అదరగొట్టారు.  ఈ మూవీ పెద్ద హిట్‌ అయిన నేపథ్యంలో దానికి సీక్వెల్‌ని రూపొందిస్తున్నారు దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్.

 `జైలర్‌ 2`లో విలన్‌గా నాగార్జున ?

రమ్యకృష్ణ, మిర్నా రెండో భాగంలో కూడా నటిస్తున్నారు. మొదటి భాగంలో విలన్ వినాయకన్. ఇప్పుడు `జైలర్ 2`లో విలన్‌గా నాగార్జునని తీసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి.

త్వరలో అధికారిక ప్రకటన

నాగార్జున రజనీకాంత్ తో ఇప్పటికే ‘కూలీ’ సినిమాలో నటించారు. ఇప్పుడు `జైలర్ 2`లోనూ ఆయన విలన్‌గా నటిస్తున్నారనే వార్త అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతుంది. 

ఇందులో మోహన్‌లాల్‌, శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.  దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ