`ఖుషి` సినిమా రీరిలీజ్‌, ప్రకటించిన నిర్మాత. . ఇండస్ట్రీ హిట్‌ మ్యాజిక్ రిపీట్‌ అవుతుందా?

Published : May 28, 2025, 10:29 PM ISTUpdated : May 28, 2025, 10:39 PM IST
vijay

సారాంశం

దళపతి విజయ్‌ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ చెప్పారు నిర్మాత ఏఎం రత్నం. విజయ్ హిట్ సినిమాలు `ఖుషి`, `శివకాశీ` రీ రిలీజ్ కాబోతున్నాయట.

పాత హిట్ సినిమాలను డిజిటల్ టెక్నాలజీతో డిజిటల్‌లో కన్వర్ట్ చేసి 4కే రిజల్యూషన్‌తో సినిమాలు రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్. అంతేకాదు పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. 

విజయ్ ‘గిల్లి’ కూడా గత ఏడాది రీ రిలీజ్ అయ్యి బాగానే ఆడింది. రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘గిల్లి’ నిలిచింది. తమిళనాడులో ఫస్ట్, ఇండియాలో సెకండ్ ప్లేస్ దక్కించుకుంది.

ఇప్పుడు విజయ్ ‘సచిన్’ కూడా రీ రిలీజ్ అయ్యింది. ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో విజయ్ హీరోగా వచ్చిన ఇతర హిట్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేయాలని నిర్మాతలు  భావిస్తున్నారు.  2000 లో విజయ్, జ్యోతిక నటించిన ‘ఖుషీ’ని రీ-రిలీజ్ చేయాలని నిర్మాత ఏ.ఎం.రత్నం అనుకుంటున్నట్టు తెలిసింది.

అటు 2005 లో విజయ్, అసిన్ నటించిన ‘శివకాసి’ని కూడా డిజిటల్ గా మెరుగుపరిచి రీ-రిలీజ్ చేస్తామని ఏ.ఎం.రత్నం ప్రకటించారు. దీంతో దళపతి విజయ్‌ ఫ్యాన్స్ ఫుల్‌ఖుషీ అవుతున్నారు. విజయ్ ప్రస్తుతం `జన నాయకన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది వచ్చే సంక్రాంతికి విడుల కానుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?