తమిళ సినిమా పాటలపై అనురాగ్‌ కశ్యప్‌ విమర్శలు.. మణిరత్నం దిమ్మతిరిగే కౌంటర్‌

Published : May 28, 2025, 10:52 PM IST
maniratnam

సారాంశం

తమిళ సినిమా పాటల్లో ఇంగ్లీష్‌ ఎక్కువగా వాడడంపై అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలకు మణిరత్నం స్పందించారు. క్రేజీ కామెంట్స్ చేశారు. 

ఎప్పటికీ నిలిచే తమిళ పాటలు

తమిళ సినిమాల్లో  కథలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, అలాగే పాటలకూ అంతే ప్రయారిటీ ఉంటుంది. పాటల కోసమే చాలా సినిమాలు ఆడేవి. 50 ఏళ్ల క్రితం పాటలు ఇప్పటికీ చాలా మంది ప్లే లిస్ట్‌లో ఉంటాయి. 

మూడు గంటల సినిమాలో చెప్పలేని విషయాన్ని మూడు నిమిషాల పాటలో చెప్పగలిగే ప్రతిభ తమిళ గీత రచయితలకు ఉండేది. అందుకే పాత పాటలు ఇప్పటికీ మనసు దోచుకుంటున్నాయి.

ఇంగ్లీష్‌ పదాలపై అనురాగ్‌ కశ్యప్‌ విమర్శలు

కానీ ఇప్పుడు పాటలు, వాటి సాహిత్యం చాలా మందికి అర్థం కావడం లేదు. ఇంగ్లీష్ వంటి ఇతర భాషల పదాలు పాటల అందాన్ని పాడు చేస్తున్నాయి. దీని గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ, ఇప్పుడు తమిళ పాటల్లో తమిళం వినిపించడం లేదని, 

ఒకప్పుడు తమిళ పాటలను హిందీలోకి అనువదించుకునే వారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, తమిళ పాటలు ఇంగ్లీష్‌ పదాలతో అర్థరహితంగా తయారవుతున్నాయని విమర్శించారు.

ఆంగ్ల పదాలపై మణిరత్నం వివరణ

దీనికి స్పందిస్తూ మణిరత్నం, “నా చాలా సినిమాల పేర్లు తమిళంలోనే ఉంటాయి. నాకు తమిళం అంటే చాలా ఇష్టం. నేను, రెహమాన్ తమిళ సాహిత్యం నుంచి చాలా కవితలను పాటలుగా మార్చాం. యువతరం కోసం ఇంగ్లీష్‌ పదాలు వాడుతున్నామని నేను అనుకోను.

 అది మాత్రమే సినిమాను హిట్ చేయదు. మంచి కథ, పాత్రలు ఉంటేనే సినిమా ఆడుతుంది. పాటలో, టైటిల్‌లో ఏమున్నా సినిమా ఆడాలంటే మంచి కథ ఉండాలి` అని అనురాగ్‌ కశ్యప్‌కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. 

జూన్‌ 5న కమల్‌, మణిరత్నం `థగ్‌ లైఫ్‌` విడుదల 

మణిరత్నం ప్రస్తుతం కమల్‌ హాసన్‌ హీరోగా `థగ్‌ లైఫ్‌` చిత్రాన్ని రూపొందించారు. శింబు, త్రిష, అభిరామి, నాజర్‌, తనికెళ్ల భరణి, అశోక్‌ సెల్వరాజ్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జూన్‌ 5న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనురాగ్‌ కశ్యప్‌ కామెంట్లపై మణిరత్నం స్పందించి, అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే