Nagarjuna, Akhil Movie: చైతూ లైన్ లోకి వచ్చాడు... ఇక అఖిల్ ను సెట్ చేసే పనిలో నాగార్జున...

By Mahesh Jujjuri  |  First Published Feb 28, 2022, 1:17 PM IST

ఆ మధ్య కాలంలో వరుస    ప్లాప్ లతో ఇబ్బంది పడ్డారు అక్కినేని కుర్ర హీరోలు నాగచైతన్య, అఖిల్. ఇక ఇప్పుడిప్పుడే సక్సెస్ లైన్ లోకి వస్తున్నారు ఇద్దరు.  రీసెంట్ గా చైతూకి సూపర్ సక్సెస్ ఇచ్చిన కింగ్.. ఇప్పుడు అఖిల్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.


ఆ మధ్య కాలంలో వరుస  ప్లాప్ లతో ఇబ్బంది పడ్డారు అక్కినేని కుర్ర హీరోలు నాగచైతన్య, అఖిల్. ఇక ఇప్పుడిప్పుడే సక్సెస్ లైన్ లోకి వస్తున్నారు ఇద్దరు.  రీసెంట్ గా చైతూకి సూపర్ సక్సెస్ ఇచ్చిన కింగ్.. ఇప్పుడు అఖిల్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

అక్కినేని హీరోలను వరుస ప్లాప్ లు ముంచెత్తిన టైమ్ లో కలిసి కట్టుగా ఆ స్ట్రగుల్ టైమ్ ను ఫేస్ చేశారు. టీమ్ వర్క్ తో దుమ్ము రేపారు. నాగచైతన్యకు హిట్ లేని టైమ్ లో నాగ్ సలహాలతో పాటు వీరి కాంబినేషన్ లో బంగార్రాజు సినిమా బాగా వర్కైట్ అయ్యింది. ఈలోపు లవ్ స్టోరీ లాంటి సక్సెస్ చైతూకి బూస్ట్ అప్ ఇచ్చింది.

 

అయితే నాగార్జున - నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు ఈ ఏడాది పొంగల్ కానుకగా రిలీజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ఈ సినిమా ఒక రేంజ్ లో సందడి చేసింది. రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకి ముందు వరుస పరాజయాలతో ఉన్న నాగార్జునకు కూడా బూస్టప్ ఇచ్చింది. ఈ సినిమాతో నాగార్జున హీరోగా .. నిర్మాతగా తాను భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, నాగచైతన్య కెరీర్ ను కూడ ముందు నెట్టాడు.

 

చైతూ సక్సెస్ లైన్ లో పడటంతో ఇప్పుడు అఖిల్ మీద దృష్టి పెట్టాడు నాగార్జున. కెరీర్ బిగినింగ్ నుంచి వరుస ప్లాప్ లతో హాట్రిక్ ఫెయిల్యూర్స్ ను చూశాడు అఖిల్. రీసెంట్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఒక హిట్ ను తన ఖాతాలో వుసుకున్నాడు. కాని ఇప్పుడు సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు అఖిల్. దాని కోసం ఒక వైపు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సిక్స్ ప్యాక్ తో అఖిల్ ఏజంట్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో పాటు బంగార్రాజు మాదిరిగానే తన తండ్రితో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నాగార్జున .. అఖిల్ తో కలిసి ఒక సినిమా చేయనున్నారనే టాక్ బలంగానే వినిపిస్తోంది. 

వీరిద్దరు మనం సినిమాలో కనిపించినా.. అఖిల్ ది అందులో గెస్ట్ రోల్ మాత్రమే. చైతన్యతో బంగార్రాజు చేసినట్టుగా ఫుల్ లెన్త్ క్యారెక్టర్స్ తో తండ్రీ కొడుకులు ఇద్దరూ మల్టీ స్టారర్ చేయబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ దెబ్బతో అఖిల్ కు కూడా మంచి హిట్ ఇవ్వాలని నాగ్ ప్రయత్నం చేస్తున్నాడట. ఈ సినిమా కూడా నాగ్ సొంత బ్యానర్లోనే రూపొందనుందని చెబుతున్నారు. చిరంజీవితో గాడ్ ఫాదర్ రూపొందిస్తున్న మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.ఇప్పటి వరకూ అఫీషియల్ గా సినిమా అనౌన్స్ చేయలేదు. త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

click me!