
రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఈ నేపథ్యంలో కిరణ్ కి ఆఫర్స్ వరుస కడుతున్నాయి. ఆయన లేటెస్ట్ మూవీ సెబాస్టియన్ పిసి 524 మార్చి 4న గ్రాండ్ విడుదలకు సిద్ధమైంది. దీంతో నేడు సెబాస్టియన్ ట్రైలర్(SebastianPC524 Trailer) విడుదల చేశారు. రెండున్నర నిమిషాల సెబాస్టియన్ ట్రైలర్ ఆసక్తికర అంశాలతో సాగింది. హీరో కిరణ్ పోలీస్ కానిస్టేబుల్ కాగా రేచీకటి సమస్యతో బాధపడుతూ ఉంటాడు. తన సమస్య ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు.
పోలీస్ అంటే అనుక్షణం కళ్ళతో నేరస్థులను గమనించాల్సి ఉంటుంది. అలాంటిది రేచీకటి సమస్య ఉన్న సెబాస్టియన్ కానిస్టేబుల్ గా ఉద్యోగ బాధ్యతలు ఎలా నెరవేర్చాడు. ఈ క్రమంలో సెబాస్టియన్ ఎదుర్కున్న సమస్యలేంటి అనేదే సెబాస్టియన్ మూవీ ప్రధాన నేపథ్యంగా తెలుస్తుంది. హ్యూమర్, రొమాన్స్, సస్పెన్సు అంశాలు కలగలిపి సెబాస్టియన్ తెరకెక్కింది. ట్రైలర్ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.
బాలాజీ సయ్యపురెడ్డి ఈ చిత్ర దర్శకుడు కాగా... సిద్దా రెడ్డి, ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. నువేక్షణ, కోమలి ప్రసాద్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా కిరణ్ అబ్బవరం నటించిన నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. అలాగే సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ.. అనే చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.