Bheemla Nayak:“భీమ్లా నాయక్” ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

Surya Prakash   | Asianet News
Published : Feb 28, 2022, 11:42 AM IST
Bheemla Nayak:“భీమ్లా నాయక్” ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

సారాంశం

“భీమ్లా నాయక్” సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటించారు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన “భీమ్లా నాయక్” ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ తో మూవీ దూసుకెళ్తుండడంతో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ పట్ల ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన ‘భీమ్లా నాయక్’ టీంకు స్పెషల్ ట్రీట్ ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ‘భీమ్లా నాయక్’ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

“భీమ్లా నాయక్” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల నుండి యూఎస్ఏ వరకు భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. ఈ చిత్రానికి వీకెండ్ మూడు రోజులు  అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.  బాక్స్ ఆఫీస్ దగ్గర భీమ్లా నాయక్ సినిమా ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని పూర్తీ చేసుకుంది. సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మూడో రోజు ఆదివారం అవ్వగా సినిమా కి నైజాం ఏరియాలో అదిరిపోయే కలెక్షన్స్ సొంతం అయ్యాయి కానీ నైట్ షోలలో కొంచం డ్రాప్స్ కనిపించాయి.

ఫస్ట్  వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఏరియా వైజ్ చూస్తే…
👉నైజాం: 25.88కోట్లు(inc GST)
👉సీడెడ్ : 7.02కోట్లు
👉ఉత్తరాంధ్ర: 4.66కోట్లు
👉ఈస్ట్ గోదావరి: 3.60కోట్లు
👉వెస్ట్ గోదావరి: 3.91కోట్లు
👉గుంటూరు: 3.88కోట్లు
👉కృష్ణా: 2.31కోట్లు
👉నెల్లూరు: 1.81కోట్లు
ఆంధ్రా,తెలంగాణా మొత్తం: 53.07కోట్లు(79.10కోట్లు~ Gross)
కర్ణాటక+మిగిలిన ప్రాంతాలు: 6.10కోట్లు
ఓవర్ సీస్: 10.02కోట్లు
ప్రంపంచ వ్యాప్తంగా మొత్తం: 69.19కోట్లు(108.50కోట్లు~ Gross)

“భీమ్లా నాయక్” సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటించారు. త్వరలో భారీ సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హాజరుకానున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ