తారకరత్న ఆరోగ్యం గురించి చిరంజీవి ట్వీట్

By Surya PrakashFirst Published Jan 31, 2023, 11:28 AM IST
Highlights


తాజాగా మెగాస్టార్  చిరంజీవి ...ఈ విషయమై ట్వీట్ చేసారు. ''సోదరుడు తారక రత్న త్వరగా కోలుకుంటున్నారు. 'ఇక ఏ ప్రమాదం లేదు' అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. 


నారా లోకేష్ చేపట్టిన 'యువ గళం' పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్ళిన తారక రత్న... కుప్పంలో గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అందుతోంది.  తారక రత్నకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. 

ఈ నేపధ్యంలో  తారకరత్న కుటుంబ సభ్యులైన నందమూరి బాలకృష్ణ, తారక రత్న తండ్రి నందమూరి మోహన కృష్ణ, సతీమణి అలేఖ్యా రెడ్డి సహా కుటుంబ సభ్యులు నారాయణ హృదయాలయలో ఉన్నారు. దగ్గరుండి మరీ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు నారాయణ హృదయాలయ హెల్త్ బులిటెన్స్ విడుదల చేస్తోంది. ఎక్మో సహాయంతో చికిత్స అందిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది.  

తాజాగా మెగాస్టార్  చిరంజీవి ...ఈ విషయమై ట్వీట్ చేసారు. ''సోదరుడు తారక రత్న త్వరగా కోలుకుంటున్నారు. 'ఇక ఏ ప్రమాదం లేదు' అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. అతను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ... ఈ పరిస్థితి నుంచి కాపాడిన ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. డియర్ తారక రత్న... నీకు ఆరోగ్యకరమైన, సుదీర్ఘమైన జీవితం ఉండాలని కోరుకుంటున్నాను'' అని చిరంజీవి ట్వీట్ చేశారు.  

ఇక గుండెపోటుకు గురైన సమయం నుంచి ఆసుపత్రికి తరలించిన సమయంలో దాదాపు అరగంట వరకూ ఆయన శరీరంలో రక్త ప్రసరణ నిలిచిపోయిందని సమాచారం. దీంతో ఆ ప్రభావం మెదడుపై కూడా పడటంతో పరిస్థితి ఇంకా విషమించిందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆయనకు కృత్రిమంగా శ్వాసను అందిస్తున్నారు. మరోవైపు మెదడుకు సంబంధించి కూడా ప్రత్యేక వైద్య బృందం నిశితంగా పర్యేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 95 శాతం గుండె బలహీనం కావడంతో ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. 

 ''తారక రత్నను ఆసుపత్రిలో చూశా. ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. తారక రత్న అన్న ఫైటర్. పూర్తిగా కోలుకొని త్వరగా తిరిగి వచ్చేస్తారు. చికిత్సకు అన్నయ్య స్పందిస్తున్న తీరుపై వైద్యులు కూడా సంతృప్తిగా ఉన్నారు. నాకు చిన్నప్పటి నుంచి అన్నతో అనుబంధం ఉంది. ఆయన నాకు తెలుసు. చాలా మంచి వ్యక్తి. త్వరగా కోలుకుని తిరిగి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను'' అని  మంచు మనోజ్ చెప్పారు.  
 

click me!