
నాగచైతన్య నటించిన సినిమాలు ఇటీవల డిజాస్టర్ ఫలితాలను చవిచూశాయి. కానీ వెబ్ సిరీస్ `దూత` మంచి ఆదరణ పొందింది. ఓటీటీలో మంచి వ్యూస్ రాబట్టుకుంది. క్రిటికల్‌గా ప్రశంసలందుకుంది. కెరీర్‌కి కొంత ఇది బూస్ట్ ఇచ్చింది. `మనం` లాంటి మ్యాజిక్ చేసిన విక్రమ్ కుమార్ ఆ వెబ్ సిరీస్‌ని రూపొందించడం విశేషం. ఇక కొత్త సినిమాకి రెడీ అవుతున్నాడు నాగచైతన్య. ఇటీవల ఆయన `తండేల్` మూవీని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా షూటింగ్‌లోకి చైతూ అడుగుపెట్టారు. కొత్త మేకోవర్‌తో ఆయన రంగంలోకి దిగుతున్నారు.
చేపల పట్టే జాలర్ల కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు చందూ మొండేటి. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్కేల్‌లో ప్లాన్ చేశారు. ఇందులో చేపలు పట్టే జాలరిగా నాగచైతన్య కనిపించనున్నారు. ఆ నేపథ్యంలో ఆ సాహసోపేతమైన లవ్ స్టోరీని ఇందులో చెప్పబోతున్నారు. చైతూకి జోడీగా సాయిపల్లవి నటిస్తుంది. ఇప్పటికే కర్నాటకలో మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. తాజాగా నాగచైతన్య షూటింగ్‌లోకి అడుగుపెట్టారు. సముద్రంలో సాహసయాత్ర ప్రారంభించాడు చైతూ.
ఈ మేరకు ఓ కొత్త లుక్‌ని విడుదల చేసింది యూనిట్. ఇందులో సముద్రంలోకి వేటకు వెళ్తున్నట్టుగా చైతూ లుక్ ఉంది. సముదపు ఒడ్డున పడవలు కనిపిస్తున్నాయి. ఆయన సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. ఇన్ని రోజులు ముందుగా వర్క్ షాప్ నిర్వహించారట. అది కంప్లీట్ చేసుకుని ఇప్పుడు షూటింగ్‌లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. రియలిస్టిక్ అంశాలతో ఈ మూవీ తెరకెక్కుతుందని తెలుస్తుంది.
`లవ్ స్టోరీ` తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలున్నాయి. మరోవైపు సాయిపల్లవి చేసే సినిమా అంటే కచ్చితంగా బలమైన కంటెంట్ ఉంటుందనే నమ్మకం ఉంది. అంతేకాదు `కార్తికేయ 2` తర్వాత చందూ మొండేటి నుంచి వస్తోన్న సినిమా కావడం కూడా దీనిపై అంచనాలు నెలకొన్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పై బాబీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. `థ్యాంక్యూ`, `కస్టడీ` వంటి సినిమాలతో ఫెయిల్యూర్స్ అందుకున్న చైతూ.. ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ కావాలని భావిస్తున్నారు.