రామ్ చరణ్ తో వన్స్ మోర్ అంటున్న కియారా అద్వాని, ముచ్చటగా మూడోసారి..

By Mahesh Jujjuri  |  First Published Dec 26, 2023, 10:54 AM IST

రామ్ చరణ్ తో వన్స్ మోర్ అనబోతోందట హీరోయిన్ కియారా అద్వాని. అదేంటి ఇప్పటికే ఒక సారి అనేసింది కదా.. అంటే ముచ్చటగా మూడోసారి మెగా పవర్ స్టార్ తో జతకట్టబోతోందట.  


గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంజర్ ఇంకా నెలరోజుల షెడ్యూల్ బ్యాలన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. నెక్ట్ మన్త్ ఎండింగ్ వరకూ ఈ షెడ్యూల్ ను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు టీమ్. ఇక శంకర్ సినిమా డిలై అవ్వడంతో 2023 లో థియేటర్ లో కనిపించలేదు చరణ్. దాంతో మెగా ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింటెడ్ గానే ఉన్నారు. ఈక్రమంలో గేమ్ చేంజర్ తరువాత సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు చరణ్. అందులో భాగంగా.. ఇప్పటికే ఉప్పెన ఫేమ్..  బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌ చేసేశాడు. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. అంతే కాదు.. ప్రస్తుతం  ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. 


ఇక ఈసినిమాను లేడ్ చేయకుండా వరుసగా షెడ్యూల్స్ పెట్టుకుని కంప్లీట్ చేయాలి అనేది టార్గెట్ గా పెట్టుకున్నాడు చరణ్. ఈ క్రమంలో సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయి. బుచ్చిబాబు సినిమాలో చరణ్ జోడీగా ఎవరిని తీసుకోవాలి అని చాలా రోజులుగా సర్చింగ్ జరుగుతుందట. అందులో భాగండా చాలా మంది హీరోయిన్ల పేర్లు బయటకువచ్చాయి. ముఖ్యంగా సాయి పల్లవి ఈసినిమా కోసం ఫిక్స్ అయ్యింది అన్నారు. అందరూ ఆమె ఫిక్స్ అనుకున్నారు. అంతే కాదు అంతకు ముందు మృణాల్, పూజా హెగ్డే, దీపికా పదుకునే పేర్లు కలుపుకుని. సోషల్ మీడియాలో విచ్చల విడిగాప్రచారం చేశారు. కానిఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 

Latest Videos

రీసెంట్  ఇన్ఫర్మేషన్ ప్రాకాంరం...  ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అనే విషయం బయటికొచ్చింది. అందులో ఓ హీరోయిన్‌ పేరును దాదాపు ఖరారు చేసేశారు అని కూడా అంటున్నారు.ఉత్తరాంధ్రలోని గ్రామీణ నేపథ్యంలో సాగుతుందట. కబడ్డీ ఆట ప్రధానంగా సాగే ఈ సినిమాను త్వరలో ప్రారంభిస్తారట. ప్రస్తుతం కాస్టింగ్‌ పనులు తుది దశకు చేరుకున్నాయట. అలా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

అందులో ఒక మీరోయిన్ గా కియారా అద్వాని ఫిక్స్ అయ్యిందట. ఈ సినిమాలో కియారా నటిస్తే.. రామ్ చరణ్ తో ముచ్చటగా మూడో సినిమా చేసినట్టు అంవుతుంది. టాలీవుడ్ లో చేసిన నాలుగు సినిమాల్లో.. మూడు సినిమాలు చరణ్ జోడిగానే అవుతాయి. అయితే ప్రస్తుతం ఈ న్యస్ కుసబంధించిన ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. రూమర్ గా మాత్రమే ఉంది. ఇక ఇప్పటికే వినయ విధేయ రామా సినిమాలో ఇద్దరూ కలసి నటించారు. ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తోందీ జంట. ఇప్పుడు బుచ్చిబాబు సానా సినిమా ఓకే అయితే హ్యాట్రిక్‌ అవుతుంది. చరణ్‌ సినిమాల్లో హీరోయిన్ల రిపీట్‌ అంటే కాజల్‌ మాత్రమే గుర్తొస్తుంది. ఇప్పుడు కియారా కూడా గుర్తొస్తుంది అన్నమాట. 

click me!