నేను కోలుకున్నా.. కానీ ఆయన గురించే నా బెంగః గాయని సునీత

Published : Aug 19, 2020, 07:57 AM ISTUpdated : Aug 19, 2020, 08:01 AM IST
నేను కోలుకున్నా.. కానీ ఆయన గురించే నా బెంగః గాయని సునీత

సారాంశం

వైరస్‌తో పోరాడటం అంత ఈజీ కాదని గాయని సునీత చెప్పింది. అయినప్పటికీ తాను కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపింది. తనకు చాలా తక్కువ లక్షణాలు ఉండటం వల్ల త్వరగా కోలుకున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

తన గాత్రంతో శ్రోతలను విశేషంగా అలరిస్తోన్న ప్రముఖ గాయకురాలు సునీత ఇటీవల కరోనాకి గురైన విషయం తెలిసిందే. ఓ టెలివిజన్‌లో ప్రసారమయ్యే మ్యూజికల్‌ ఈవెంట్‌ కోసం షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు తనతోపాటు కొంత మంది సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా ఆమె కోలుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సునీత సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఫేమ్‌ బుక్‌లో ఓ వీడియోని విడుదల చేశారు. 

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, తన క్షేమం కోరుతూ ఫోన్స్ చేస్తున్న వారందరికి ముందుగా ధన్యవాదాలు తెలిపారు. నిజమే..నేను కరోనా బారిన పడిన మాట వాస్తవమే. ఇటీవల ఓ షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత తలనొప్పి రావడంతో ఎందుకైనా మంచిదని, టెస్ట్ చేయించాను. అందులో పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అప్పట్నుంచి వైద్యుల సూచనలు పాటిస్తూ, హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపింది. 

ఇంకా చెబుతూ, వైరస్‌తో పోరాడటం అంత ఈజీ కాదని చెప్పింది. అయినప్పటికీ తాను కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపింది. తనకు చాలా తక్కువ లక్షణాలు ఉండటం వల్ల త్వరగా కోలుకున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

మరోవైపు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం సైతం గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన హెల్త్ విషయంలో సునీత స్పందిస్తూ, బాలు గారి విషయంలో చాలా బాధగా ఉందని తెలిపింది. ఆయన త్వరగా కోలుకుని రావాలని తమ కుటుంబం మొత్తం ప్రార్థిస్తున్నట్టు వీడియోలో వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ టెలివిజన్‌ కార్యక్రమంలో సునీతతోపాటు మరో గాయని మాళవికకి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఇంకా ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటోంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా