ఇప్పుడు ఓ చిన్న సంఘటనతో దిల్ రాజుకు, అల్లు అరవింద్ కు మధ్య చెడింది అనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సినిమా ఇండస్ట్రీలో రిలేషన్స్ చాలా సున్నితంగా ఉంటాయి. ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే చాలా పనులు ముందుకు వెళ్తాయి. ముఖ్యంగా థియేటర్స్ షేరింగ్, డిస్ట్రిబ్యూషన్ వంటి బిజినెస్ విషయాల్లో నిర్మాతలు తమ మధ్య గొడవలు రాకుండా చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఓ చిన్న సంఘటనతో దిల్ రాజుకు, అల్లు అరవింద్ కు మధ్య చెడింది అనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందులో ఎంతవరకూ నిజం ఉందో కానీ సోషల్ మీడీయాలో కూడా అదే చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే...
విజయ్ దేవరకొండ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన గీత గోవిందం సినిమాకు సీక్వెల్ రాబోతోందనే వార్తలు గత రెండ్రోజులుగా ఎక్కువగా వినిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎవ్వరు చేయబోతున్నారు. ఏ నిర్మాత హ్యాండిల్ చేయబోతున్నారనే విషయం మీద ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే గీత గోవిందం సినిమాను నిర్మించింది గీతా ఆర్ట్స్ సంస్థ. ఒక వేళ దాని సీక్వెల్ తీయాలంటే ఆ సంస్థే తీయాలి అనుకున్నారు. కానీ మధ్యలో దిల్ రాజు ఎంట్రీ ఇచ్చాడు.
కానీ ఊహించని విధంగా దిల్ రాజు పరుశురామ్ విజయ్ కాంబోలో సినిమా రాబోతోందనే ప్రకటన వచ్చింది. దీంతో అది గీత గోవిందం సీక్వెల్ అని అంతా ఫిక్స్ అయ్యారు. దీంతో అల్లు అరవింద్‌కు కోపం వచ్చిందని సమాచారం. దాంతో నిన్న సాయింత్రం ఓ ప్రెస్ మీట్ అనౌన్స్ చేశారు. ఆ ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్ ఏం మాట్లాడాతాడా? అని అంతా ఎదురుచూశారు. కానీ చివరకు ఆ ప్రెస్ మీట్‌ను అల్లు అరవింద్ క్యాన్సిల్ చేసారు. ఈ గ్యాప్ లో ఏం జరిగింది..
ప్రెస్ మీట్ అన్న వార్త బయటకు రాగానే అది పరుశురామ్ గురించే అని అందురు అనుకున్నారు. అదే విషయమై మీడియాకు లీక్ లు వచ్చాయి. దాంతో హడావిడిగా పరుశురామ్ వెళ్లి అల్లు అరవింద్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలిసింది. చాలా కోపంగా ఉన్న అరవింద్ తో తను దిల్ రాజుతో కలిసి ఈప్రాజెక్టు చేస్తానని చెప్పినట్లు , దానికి అరవింద్ వద్దన్నట్లు చెప్పుకుంటన్నారు. మరో ప్రక్క అసలు తన చేయాల్సిన సీక్వెల్ ని దిల్ రాజు ఎలా టేకప్ చేస్తారు అని అరవింద్ కోప్పడినట్లు తెలుస్తోంది. దాంతో త్వరలో అల్లు అర్జున్ తో సినిమా చేద్దామనే ప్లాన్ లో ఉన్న దిల్ రాజు ఇక ఆ డేట్స్ దొరకటం కష్టమే అంటున్నారు. అప్పటికీ దిల్ రాజు టీం నుంచి అల్లు అరవింద్‌ను కొంత మంది కలిశారట. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు కానీ ఫలితం లేదంటున్నారు. పరుశురామ్ కూడా పర్సనల్‌గా సారీ చెప్పినట్టుగా తెలుస్తోంది.