శివమణి జాస్‌ కొట్టినట్టుంది.. పవన్‌ స్పీచ్‌పై నాగబాబు అదిరిపోయే రియాక్షన్‌.. పోసాని, పేర్నినానిలపై మీమ్స్

Published : Sep 30, 2021, 07:45 AM IST
శివమణి జాస్‌ కొట్టినట్టుంది.. పవన్‌ స్పీచ్‌పై నాగబాబు అదిరిపోయే రియాక్షన్‌.. పోసాని, పేర్నినానిలపై మీమ్స్

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌(pawan kalyan) స్పీచ్‌పై, ఆయనపై విమర్శలు చేసిన నటుడు పోసాని(posani)పై, అలాగే ఏపీ మంత్రి పేర్ని నానిలపై పంచ్‌లు వేశారు నాగబాబు(nagababu). తాజాగా ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

`రిపబ్లిక్‌` ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఏపీ ప్రభుత్వంపై, టికెట్లు రేట్లు ఆన్‌లైన్‌ చేయడం, థియేటర్లు ఓపెన్‌ చేయకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వార్నింగ్‌లతోపాటు విమర్శలు గుప్పిస్తూ ఫైర్‌ అయ్యారు. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ స్పీచ్‌పై, ఆయనపై విమర్శలు చేసిన నటుడు పోసానిపై, అలాగే ఏపీ మంత్రి పేర్ని నానిలపై పంచ్‌లు వేశారు నాగబాబు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

పవన్‌ కళ్యాణ్‌ స్టార్‌ హీరో అని, ఆయనకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు. అంతేకాదు ఈ సందర్భంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళీ చెప్పిన విషయాల వీడియో క్లిప్‌ని షేర్‌ చేశారు. ఇందులో పోసాని.. `ఈరోజు పవన్‌కల్యాణ్‌ ఒకవేళ సినిమా హీరోగా పనిచేస్తానంటే నేను ఆయనకి బ్లాంక్‌ చెక్‌ ఇస్తా. ఎన్నిసున్నాలైనా పెట్టుకోవచ్చు. రూ.40 కోట్లైనా పవన్‌కల్యాణ్‌కి ఇస్తా. ఎందుకంటే ఆయన అంత డిమాండ్‌ ఉన్న హీరో. వన్‌ ఆఫ్‌ ది టాప్‌ హీరో ఇన్‌ ఇండియా నాట్ ఓన్లీ ఇన్‌ తెలుగు స్టేట్స్‌. రూ.5 కోట్లు లేదా రూ.10 కోట్ల కోసం ఆయన పిచ్చి పిచ్చి పనులు చేయడు. నాకు తెలుసు` అని ఈ వీడియో పోసాని చెప్పాడు. 

అయితే ఇటీవల పోసాని.. పవన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్‌ రెమ్యూనరేషన్‌ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో పోసానికి మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా, అభిమానికి సమాధానం చెప్పారు నాగబాబు. `రిపబ్లిక్‌` ఈవెంట్‌లో పవన్‌ స్పీచ్‌ ఎలా ఉందన్న ప్రశ్నకి నాగబాబు స్పందిస్తూ, `అదిరిపోయింది. ఒక శివమణి జాస్‌ కొట్టినట్టు. ఒక జాకీర్‌ హుస్సేన్‌ తబల వాయించినట్టు. శంకర్‌ సినిమాకి రెహమాన్‌ మ్యూజిక్‌ ఇచ్చినట్టు ఉంది` అని పేర్కొన్నారు. 

ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై అభిమాని అడిగిన ప్రశ్నకి నాగబాబు స్పందిస్తూ, పేర్ని నాని మహానటుడనే విషయాన్ని వెల్లడించారు. `నేను ఏం చెప్పాలి.. భారతదేశంలో ఎన్ని అవార్డులుంటే అన్ని అవార్డులు వస్తాయి. ఆస్కార్‌కి కూడా వెళ్లే అవకాశం ఉంది`. అంటూ `గుండెల్లో గోదారి` ఆడియో ఫంక్షన్‌లో మోహన్‌బాబు చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు నాగబాబు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు
Sobhan babu జీవితాన్ని ఒక్క సినిమాతో నిలబెట్టిన ఎన్టీఆర్, ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా?