12 ఏళ్ళ చేదు జ్ఞాపకం గుర్తు చేసుకున్న నాగబాబు... కానీ రీరిలీజ్ చేస్తాడట! 

By Sambi ReddyFirst Published Nov 27, 2022, 5:20 PM IST
Highlights

12 ఏళ్ల చేదు జ్ఞాపకాన్ని నాగబాబు తిరిగి గుర్తు చేసుకున్నాడు. ఒకప్పుడు ఆరంజ్ మూవీపై నెగిటివ్ కామెంట్స్ చేసిన నాగబాబు అది కల్ట్ క్లాసిక్, రీ రిలీజ్ చేస్తాను అంటున్నాడు. ఆ కథేమిటో చూద్దాం... 
 


మెగా బ్రదర్స్ లో నాగబాబు అత్యంత దురదృష్టవంతుడు. స్టార్ హీరోల అండ ఉండి కూడా ఏ రకంగానూ ఎదగలేకపోయాడు. చిరంజీవి సపోర్ట్ తో నాగబాబు హీరో అవ్వాలి అనుకున్నాడు. అది కుదరక నిర్మాతగా మారాడు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో చిరంజీవితో సినిమాలు చేశాడు. చిరంజీవి కాల్షీట్స్ ఇస్తే కాసులే అన్న రోజుల్లో మనోడు హ్యాండ్ పవర్ కి అట్టర్ ప్లాప్స్ పడేవి. అన్నయ్య చిరంజీవితో నాగబాబు నిర్మించిన రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు ఫ్లాప్ అయ్యాయి. 

బావగారు బాగున్నారా మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ బడ్జెట్ తో తీసిన ఆ సినిమా లాభాలు తెచ్చినట్లు లేదు. అన్నయ్యతో కాదని తమ్ముడు పవన్ స్టార్ అయ్యాక ఆయనతో ట్రై చేశాడు. గుడుంబా శంకర్ మూవీ చేస్తే అట్టర్ ప్లాప్. అన్నదమ్ములతో కావడం లేదు, నెక్స్ట్ జనరేషన్ ని చూద్దామని రామ్ చరణ్ తో ఆరంజ్ మూవీ చేశాడు. ఆరంజ్ మూవీ నాగబాబును లిటరల్ గా రోడ్డు మీదకు తెచ్చింది. ఆరంజ్ డిజాస్టర్ కావడంతో ఉన్నవన్నీ పోవడంతో పాటు అప్పులు మిగిలాయి. 

కొంతలో కొంత పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడని అప్పట్లో నాగబాబు చెప్పాడు. ఆరంజ్ దెబ్బకు నాగబాబు కామెడీ షోలు చేసుకునే స్థాయికి పడిపోయాడు. దరిద్రుడు దొడ్డికెళితే సముద్రం కూడా ఎండిపోయిందన్నట్లు... చిరు, పవన్, రామ్ చరణ్ ఒక్కరు కూడా నాగబాబుకు కోట్లు తెచ్చిపెట్టే సినిమా ఇవ్వలేకపోయారు. కాగా ఆరంజ్ అనుభవాలు నాగబాబును ఏళ్ల తరబడి వెంటాడాయి. నటుడిగా, జబర్దస్త్ జడ్జిగా సంపాదించిన డబ్బులతో అప్పులు తీర్చుకొని మెల్లగా కుదుట పడ్డాడు. ఈ లోపు వరుణ్ ఓ మోస్తరు హీరోగా ఎదగడంతో నాగబాబు ఆర్థికంగా నిలదొక్కున్నాడు. 

అంతగా నాగబాబును ఆరంజ్ ఇబ్బంది పెట్టింది. ఐతే అవన్నీ మర్చిపోయిన నాగబాబు దాన్ని కల్ట్ క్లాసిక్ అంటున్నాడు. త్వరలో రీ రిలీజ్ చేస్తానని ప్రకటించారు. ఆరంజ్ విడుదలై 12 ఏళ్ళు అవుతుండగా అభిమానుల కోరిక మేరకు రీరీలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటనకు సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేశాడు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా... హారిష్ జైరాజ్ ఆల్ టైం బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు. 

click me!
Last Updated Nov 27, 2022, 5:20 PM IST
click me!