"వాడొక యానిమల్ ! ఆడేమి మనిషి అండీ" : కోట శ్రీనివాసరావు పై నాగబాబు

By Surya PrakashFirst Published Oct 10, 2021, 10:22 AM IST
Highlights

ప్రకాశ్ రాజ్ ఏనాడూ షూటింగ్ కు టైంకు రాలేదు.. ఆయనకు క్రమశిక్షణ లేదు అని ఇటీవల సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల ఓ కామెంట్ చేశారు. ప్రకాశ్ రాజ్ తరఫున మెగా మద్దతుదారు అయిన నాగబాబు ఈ కామెంట్స్ ను తిప్పికొడుతూ వస్తున్నారు. సరిగ్గా 24 గంటల ముందు.. ఓ తెలుగు టీవీ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘మా’ ఎలక్షన్స్ ... మామూలు పొలిటికల్ ఎలక్షన్స్ ని మించిపోతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరెత్తిపోయింది.  ఎన్నో వివాదాలు, ప్రెస్ మీట్స్ ,ట్వీట్స్, ఫేస్ బుక్ పోస్ట్ లు. ఈ క్రమంలో ‘మా’ ఎన్నికల వివాదంపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు   డిబేట్‌లో మాట్లాడారు. తాను రెండు విషయాలు అడగ దలుచుకున్నానని చెప్పారు. అసలు "మా" ఎన్నికలను ఎవరు అనౌన్స్‌ చేశారని ప్రశ్నించారు. ‘‘ఇప్పుడున్న కమిటీ ఏమైనా ప్రకటించిందా?. ఏదో ప్యానల్‌ అని అనౌన్స్‌ చేశారు.. నాకదే ఆగ్రహం కలిగించింది. టైమ్‌ వచ్చినప్పుడు మాట్లాడవచ్చు.. ఇప్పుడది అనవసరం. ప్రకాష్‌రాజ్‌కు చిరంజీవి మద్దతిచ్చారో.. లేదో.. నాకు తెలియదు. నాగబాబు కూడా ఈ విషయంపై వ్యాఖ్యలు చేయడం సరికాదు.’’ అని కోట శ్రీనివాసరావు అన్నారు.

 అలాగే ప్రకాశ్ రాజ్ ఏనాడూ షూటింగ్ కు టైంకు రాలేదు.. ఆయనకు క్రమశిక్షణ లేదు అని ఇటీవల సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల ఓ కామెంట్ చేశారు. ప్రకాశ్ రాజ్ తరఫున మెగా మద్దతుదారు అయిన నాగబాబు ఈ కామెంట్స్ ను తిప్పికొడుతూ వస్తున్నారు. సరిగ్గా 24 గంటల ముందు.. ఓ తెలుగు టీవీ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మరిన్ని ఆరోపణలు ఆయన చేసారు. వాటికి కౌంటర్ ఇచ్చే ప్రాసెస్ లో నాగబాబు అన్నమాటలు చాలా మందిని బాధించాయి.

నాగబాబు మాట్లాడుతూ... " వాడు గుడ్డలిప్పుకున్నాడు , ముసలి కోట శ్రీనివాస రావు.. అతనికి వయసు అయిపోతోంది.. చాలా కాలం నుంచి అతని అవాకులు చెవాకులు వింటూనే ఉన్నా !  అతనికి బుద్ధి,జ్ఞానం ,మనిషి లక్షణాలు లేవు ... జంతు లక్షణాలు .. వాడొక యానిమల్ ! ఆడేమి మనిషి అండీ" అంటూ కోట శ్రీనివాసరావు పై కొణిదెల నాగబాబు చేసిన విమర్శ ఇప్పుడు వైరల్ అవుతోంది. " ఆ కోట శ్రీనివాసరావుకి ఎందుకండీ ? ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు వూడిపోతాడో  ( చనిపోతాడో ) తెలియదు  " అని అనకుండా ఉంటే బాగుండేది అంటున్నారు. 

Also read MAA elections: చిత్ర పరిశ్రమ ఎప్పుడూ చీలిపోదు, చిరు, మోహన్ బాబు మిత్రులు - పవన్ కళ్యాణ్

ఇక ఆదివారం జరగుతున్న టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఓటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగుతోంది.. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది.. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు కూడా వెల్లడి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పోలింగ్ అధికారులు పూర్తి చేశారు.. ఇక ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ ఉండగా వారి తరఫున వారి వారి ప్యానల్స్ నుంచి అసోసియేషన్ లో కీలక సభ్యులు పోటీ చేస్తున్నారు. ఎవరికి వారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
 

click me!