MAA elections: చిత్ర పరిశ్రమ ఎప్పుడూ చీలిపోదు, చిరు, మోహన్ బాబు మిత్రులు - పవన్ కళ్యాణ్

By team telugu  |  First Published Oct 10, 2021, 9:14 AM IST

పోలింగ్ కేంద్రంలో ఇరు ప్యానెల్ సభ్యులను పవన్ కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. మా ఎన్నికలలో ప్రత్యర్థుల మధ్య ఈ స్థాయి, ఆరోపణలు అవసరమా అనే అభిప్రాయం వెల్లడించారు.


మా ఎన్నికల్లో తన ఓటు వినియోగించుకున్నారు పవన్ కళ్యాణ్. పోలింగ్ కేంద్రంలో ఇరు ప్యానెల్ సభ్యులను పవన్ కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. మా ఎన్నికలలో ప్రత్యర్థుల మధ్య ఈ స్థాయి, ఆరోపణలు అవసరమా అనే అభిప్రాయం వెల్లడించారు. పొలిటికల్ ఎలక్షన్స్ లో సైతం అధికార, ప్రతి పక్ష పార్టీలు గెలుపు కోసం ఓ అవగాహనకు వస్తున్నాయని, అలాంటిది సినిమా పరిశ్రమలో ఇంత రాద్ధాంతం అవసరం లేదన్నారు. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది అన్నారు పవన్. 


చిత్ర పరిశ్రమ రెండుగా చీలిపోయిందని అంటున్నారని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. పరిశ్రమ విడిపోవడం ఎప్పటికీ జరగదు అన్నారు Pawan kalyan. నటులు సైడ్స్ తీసుకోవచ్చు కానీ, పూర్తిగా చీలిపోవడం ఉండదు అన్నారు. ఇక ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, అది వ్యక్తిగతమని, వ్యక్తుల కామెంట్స్, పరిశ్రమకు ఆపాదించకూడదు అన్నారు. మోహన్ బాబు, చిరంజీవి మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధం అంటున్నారు, వాళ్ళ మధ్య విబేధాలు ఉన్నాయా.. అని అడుగుగా, అలాంటిది ఏమీ లేదని, వాళ్లిద్దరూ మంచి మిత్రులు అన్నారు. 

Latest Videos

undefined

Also read Maa Elections: కాసేపట్లో వీడియో రిలీజ్ చేస్తా.. అన్ని చెబుతా, నాగబాబుకు విష్ణు కౌంటర్


ఇక మీ ఓటు ఎవరికి అన్న ప్రశ్నకు ఎన్నికలను ప్రభావితం చేస్తుంది, చెప్ప కూడదు అన్నారు. అయితే గతంలోనే పవన్ కళ్యాణ్ తన మద్దతు ప్రకాష్ రాజ్ కి ప్రకటించిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ మూవీ వేదికపై నుండి ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అన్న విషయాన్ని ఆయన ఖండించారు. పరోక్షంగా పవన్ ఆయనకు తన మద్దతు తెలియజేశారు. మరో వైపు నాగబాబు ప్రకాష్ రాజ్ కోసం పోరాడుతున్నారు. ఆయన తరపున నాగబాబు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. 

Also read పోస్టల్ బ్యాలెట్‌పై అక్కసు... మా ఎన్నికల అధికారిపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

నేడు జరుగుతున్న Maa elections లో  సభ్యులుగా ఉన్న 883 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటల నుండి మద్యం 2 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్ పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలు ఎన్నికల కేంద్రంలో మోహరించాయి. ఎలక్షన్ బ్యాలెట్ పద్దతిలో జరుగుతుండగా, ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. 

click me!