మెగా ఫ్యామిలీలో తీవ్ర విషాదం... నాగబాబు సోదర సమానుడు మృతి!

Published : Jun 04, 2021, 01:28 PM IST
మెగా ఫ్యామిలీలో తీవ్ర విషాదం... నాగబాబు సోదర సమానుడు మృతి!

సారాంశం

నాగబాబు సన్నిహితుడు, శ్రేయోభిలాషి, సోదర సమానుడు అంబటి రాజా మృతి చెందారు. నాగబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న రాజా మృతికి నాగబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

మెగా ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాగబాబు సన్నిహితుడు, శ్రేయోభిలాషి, సోదర సమానుడు అంబటి రాజా మృతి చెందారు. నాగబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న రాజా మృతికి నాగబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అంబటి రాజా మరణంపై స్పందించారు. 


'నీ మరణంతో నాశరీరంలోని ఓ భాగాన్ని కోల్పోయిన భావన కలుగుతుంది. తమ్ముడిగా నా ప్రాధాన్యత నీకు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు మరపురాని జ్ఞాపకం రాజా..' అంటూ నాగబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నాగబాబు అభిమానిగా, అంబటి రాజా ఆయనతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని అర్థం అవుతుంది. అంబటి రాజా కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో కూడా పనిచేశారని సమాచారం. 


ఇక అంబటి రాజా మరణం కూడా కరోనా కారణంగానే సంభవించినట్లు సమాచారం. కరోనా సెకండ్ వేవ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రాణాలు బలిగొంది. ప్రమాదకరంగా మారిన వైరస్ వయసుతో సంబంధం లేకుండా అందరి ప్రాణాలు తీస్తుంది. 

PREV
click me!

Recommended Stories

రాజాసాబ్ చేయకుండా తప్పించుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? ప్రభాస్ ను బుక్ చేశారుగా
The Raja Saab 6 Days Collection: ది రాజాసాబ్‌కి ఆరో రోజు పెరిగిన కలెక్షన్లు.. ప్రభాస్‌ టార్గెట్‌కి ఎంత దూరంలో ఉన్నాడంటే