ఆ సినిమా విషయంలో అప్ సెట్ అయ్యా : సమంత

By AN TeluguFirst Published May 1, 2019, 9:40 AM IST
Highlights

మంచి హిట్ అవుతుంది..మన సినిమా గురించి జనం మాట్లాడుకుంటారు..అనుకుని చేసిన సినిమాలు ప్లాఫ్ అయితే ఏ ఆర్టిస్ట్ కి అయినా బాధ కలుగుతుంది.

మంచి హిట్ అవుతుంది..మన సినిమా గురించి జనం మాట్లాడుకుంటారు..అనుకుని చేసిన సినిమాలు ప్లాఫ్ అయితే ఏ ఆర్టిస్ట్ కి అయినా బాధ కలుగుతుంది.దానికి తోడు సినిమా అద్బుతం అంటూ విమర్శకులు పొగిడాక..భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాకపోతే ఆ బాధ రెట్టింపు అవుతుంది.  సమంత కూడా ప్రస్తుతం అలాంటి సిట్యువేషన్ నే ఎదుర్కొంటోంది. ఆమె నటించిన సూపర్ డీలక్స్ సినిమా క్రిటిక్స్ మెచ్చుకున్నారు. మంచి రివ్యూలు వచ్చాయి.

కానీ బాక్సాపీస్ వద్ద రెవిన్యూ రప్పించలేకపోయింది. దాంతో సమంత బాగా అప్ సెట్ అయ్యింది. ‘సూపర్‌ డీలక్స్‌’రిలీజ్ కు ముందు తమిళనాట ఓ సంచలనం స‌ృష్టించింది. రిలీజ్ తర్వాత కూడా మంచి రివ్యూలు వచ్చాయి. సినిమా కథ, కథనాలు ఈ సినిమాకు   బజ్‌ను తీసుకొచ్చాయి. త్యాగరాజ కుమారరాజన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, ఫాహద్‌ ఫాజల్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

ముఖ్యంగా విజయ్‌ సేతుపతి, సమంత పోషించిన పాత్రలకు ప్రేక్షకులనుండి మంచి  స్పందన వచ్చింది. అంతలా ఆకట్టుకున్న ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదట. వరస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ సేతుపతి గత సినిమాలతో పోలిస్తే ఈ రేంజి బజ్ తెచ్చుకున్నా ఫలితం లేకపోయింది.  ఈ నేపధ్యంలో సమంత ఓ తమిళ వీక్లీతో మాట్లాడింది. 

సమంత మాట్లాడుతూ.. “టుబి ప్రాంక్ గా చెప్పాలంటే ...నేను అప్ సెట్ అయ్యాను. సినిమా నిజమైన విజయం..విమర్శకుల నుంచి మాత్రమే కాదు బాక్సాఫీస్ వద్ద కూడా హిట్ కావాలి. కేవలం అవార్డ్  లు మాత్రమే తెచ్చుకుని, ధియోటర్ ఓనర్స్ కు లాస్ లు వస్తే ఉపయోగం లేదు. ఎంతో డెడికేటెడ్ గా శిల్ప పాత్ర చేసిన  విజయ్ సేతుపతి ని చూసి బాధపడుతున్నాను.” అని చెప్పారామె.  

click me!